అనిల్ రావిపూడిలో చాలా కళలున్నాయి. తను మంచి డాన్సర్. నటుడు కూడా. ఆర్టిస్టులకు సీన్ చెప్పేటప్పుడు నటించి మరీ చూపిస్తాడు. అందుకే నటీనటులు కూడా… `అనిల్ రావిపూడితో సినిమా చేయడం చాలా ఈజీ. తను చేసి చూపించిన దాంట్లో సగం చేస్తే చాలు` అంటుంటారు. తన దర్శకత్వంలో రూపొందిన సినిమాల్లో.. తళుక్కున మెరవడం సెంటిమెంట్ గా మారింది. బయట కూడా ఒకట్రెండు సినిమాల్లో అతిథి పాత్రలో కనిపించాడు. జబర్దస్త్ స్టేజీపై స్కిట్ కూడా చేశాడు. ఇవన్నీ చూసి రావిపూడి కోసం కొత్తపాత్రల్ని రాసుకుంటున్నారట మిగిలిన దర్శకులు. `మా సినిమాలోనూ ఓ పాత్ర ఉంది చేయొచ్చు కదా..` అంటూ రిక్వెస్టులు పెరుగుతున్నాయట.
అయితే… రావిపూడి ఆలోచన వేరేలా ఉంది. తనకు నటనపైకూడా ఆసక్తి ఉంది. అయితే ఇప్పుడు నటించడట. తన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపైపోతున్నప్పుడు, దర్శకత్వానికి ఇక పనికిరానని డిసైడ్ అయినప్పుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుడతాడట. ఈ విషయాన్ని తానే చెప్పాడు. “నా సినిమాలు ఫ్లాపైపోతున్నపుడు మెగా ఫోన్ వదిలేసి, అప్పుడు యాక్టర్ గా సెటిల్ అవుతా.. ఇప్పుడు మాత్రం నా దృష్టి నా కథలు, సినిమాలపైనే“ అని చెప్పేశాడు. కె.విశ్వనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ వరకూ చాలామంది దర్శకులు… దర్శకత్వం నుంచి రిటైర అయిపోయి యాక్టర్లుగా స్థిరపడ్డారు. ఆ జాబితాలో.. చేరాలని రావిపూడి డిసైడ్ అయిపోయాడిప్పుడు.