‘డీజే టిల్లు’ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా క్రెడిట్ అంతా.. సిద్దూ జొన్నలగడ్డ పట్టికెళ్లిపోయినా, తెర వెనుక దర్శకుడు విమల్ కృష్ణ ప్రతిభను తక్కువ అంచనా వేయకూడదు. తను ఈ సినిమాకి రచయితగానూ పనిచేశాడు. విమల్ ప్రతిభపై నమ్మకం ఉంచిన కొంతమంది హీరోలు, నిర్మాతలు విమల్ని పిలిపించుకొని మరీ కథలు వింటున్నారు. తాజాగా… విమల్ నాగచైతన్యకు ఓ కథ చెప్పాడట. అది బాగా నచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం… నాగచైతన్య – విమల్ మధ్య కథా చర్చలు విరివిగా సాగుతున్నాయి. కథని లాక్ చేస్తే, ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలెట్టొచ్చు. కాకపోతే… నాగచైతన్య బాగా బిజీగా ఉన్నాడు. థ్యాంక్యూ విడుదలైన వెంటనే పరశురామ్ తో ఓ సినిమా మొదలెడతాడు. బొమ్మరిల్లు భాస్కర్ సైతం చైతూతో ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇవి కాక రెండు మూడు కథలు ఫైనల్ చేశాడు. వీటిమధ్య విమల్ తో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.