నజ్రియా నజీమ్ ‘అంటే సుందరానికీ’తో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. రికార్డ్ ప్రకారం ఆమెకిది తొలి తెలుగు సినిమా అయినప్పటికీ బెంగళూర్ డేస్, రాజారాణి లాంటి సినిమాలతో నజ్రియా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆమెకు ఇక్కడ మంచి క్రేజ్ వుంది. చాలా మంది దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయాలని అనుకున్నారు. ఐతే ఆమె కథల ఎంపిక విషయంలో కొంచెం పర్టికులర్. మొత్తనికి సుందరం దర్శకుడు వివేక్ ఆత్రేయతో నజ్రియాని తెలుగులో తీసుకురావడం సాధ్యమైయింది.
అయితే ఈ సినిమా తర్వాత వివేక్ అభిమానిగా మారిపోయింది నజ్రియా. ఆయనకి ఒక ఓపెన్ ఆఫర్ కూడా వచ్చింది. ”కథలు ఎంపిక విషయంలో కొంచెం పర్టిక్యులర్ వుండే మాత్ర వాస్తవమే. ఐతే వివేక్ తో సినిమా చేయాలనుకున్నపుడు ఇక అలోచించను. ఇకపై ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఓపెన్ డేట్స్ ఇచ్చేస్తా. ఆయన రైటింగ్ అద్భుతం. వివేక్ తో మరో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నా.”అని చెప్పుకొచ్చింది నజ్రియా.