తమ తప్పును పక్క వాడి మీద తోసేయడానికి ఏ మాత్రం సంకోచించని రాజకీయ నేతలు.. చివరికి పిల్లలనూ వదిలి పెట్టడం లేదు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది. గతంలో టెన్త్ పాసయిన పిల్లలంతా కాపీలు కొట్టి పాసయిన వాళ్లన్నట్లుగా మాట్లాడుతున్నారు. టెన్త్ ఫలితాలపై ఏపీలో రచ్చ జరుగుతోంది. ఈ అంశంరపై స్పందించిన సజ్జల… గతంలో కార్పొరేట్ కాలేజీలు అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవనేశారు. అంటే మాల్ ప్రాక్టీస్ చేశో.. పేపర్ లీక్ చేసో వారంతా పాసయ్యేవారన్నట్లుగా మాట్లాడుతున్నారు.
గత ఇరవై ఏళ్లుగా ఏపీలో శాతానికిపైగానా టెన్త్ విద్యార్థులు పాసవుతున్నారు. గత పదేళ్లుగా అది90 శాతం వరకూ ఉంది. కానీ ఈ ఏడాది 67 శాతానికే పడిపోయింది. ఈ కారణంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని… విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టిందని మండి పడుతున్నారు. అయితే ఈ సారి అక్రమాలను అడ్డుకున్నాం కాబట్టే.. పాస్ పర్సంటేజీ తక్కువగా ఉందని అంటున్నారు. సజ్జల వ్యాఖ్యలు సహజంగానే విద్యారంగంలో ఉన్న వారిని ఆశ్చర్య పరుస్తున్నాయి.
నిజానికి ప్రస్తుత ఫలితాల్లో ప్రభుత్వ పాఠాశాలల విద్యార్థులే బాధితులుగా మిగిలారు. ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక పాస్ పర్సంటేజీ ఉంది. కార్పొరేట్ స్కూళ్లలో అయితే 90శాతానికిపైనే ఉంది. ఇంగ్లిష్ మీడియంలో అత్యధిక పాస్ రేటు ఉంది. తెలుగు మీడియంలో సగం మంది కూడా లేరు. అయినా సజ్జల రామకృష్ణారెడ్డి తమ ప్రభుత్వ చేతకాని తనాన్ని గతంలో కష్టపడి చదువుకున్న విద్యార్థుల నిజాయితీపైకి నెట్టేస్తున్నారు. ఇలాంటి రాజకీయ నేతలు ఉంటే చాలని.. అందరూ అక్రమార్కులే అవుతారని.. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.