పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ కంగారు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఎంత దారుణమైన మాటలకైనా దిగజారిపోతోంది. తాజాగా ఆయనను బ్రోకర్ దారుణంగా వ్యాఖ్యానించారు ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బ్రోకరిజం చేస్తున్నట్లుగా ఉందని ప్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ, జనసేన పొత్తుల గురించి మాకు సంబంధం లేదంటూనే పవన్‌పై వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో పవన్ ఒంటరిగా పోటీ చేయాలనే తన కోరికను సజ్జల చెప్పకనే చెప్పారు. రాజకీయంగా సీరియస్‌గా ఉన్న వాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని అనుకుంటారని సజ్జల చెప్పుకొచ్చారు. జనసేన తన పార్టీ అన్న విషయాన్ని పవన్ మరిచిపోయినట్టుగా ఉన్నారని చంద్రబాబు వ్యూహాలనే పవన్ వల్లె వేస్తున్నట్లుగా అనిపిస్తోందని ఆవు కథ చెప్పుకొచ్చారు. పొత్తులపై పవన్ ఓ మాట, జనసేనతో పొత్తు కలిగిన బీజేపీ నేతలు మరో మాట మాట్లాడుతిన్నారని అంతా గేమ్ ప్లాన్ తో ఆయన చెప్పుకొస్తున్నారు.
ఇతర పార్టీలు ఎలా పొత్తులు పెట్టుకుంటే వైసీపీకి ఏం నొప్పో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్ కల్యాణ్ తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. అవసరమైతే ఆయనపై రాజకీయంగా.. సిద్ధాంతపరంగా విమర్శలు చేయాలి కానీ.. వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలను వైసీపీ నేతలు చేస్తున్నారు. అందులో సజ్జల కీలకంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.