కమల్ హాసన్ ఓ ప్రయోగశాల. ఫార్ముల సినిమాలు ఎప్పుడూ చేయలేదాయన. పాఠాలు నేర్చుకుంటూ నేర్పుకుంటూ కొత్తదారిలోనే వెళ్లారు. ఇప్పుడు ‘విక్రమ్’ సినిమాతో కూడా ఓ పాఠం నేర్పారు. ఈ పాఠం సీనియర్ హీరోలకి. విక్రమ్ కోసం హీరోయిజం లెక్కలు వేసుకోలేదు కమల్. కమల్ సినిమాలో హీరోయిజం లెక్క వుండదు కానీ విక్రమ్ కి వచ్చేసరికి దాన్ని మరోస్థాయికి తీసుకెళ్ళారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అసలు విక్రమ్ పాత్ర దాదాపు కనిపించదు. హాఫ్ పేజీ డైలాగులు కూడా వినిపించఉ. ఫస్ట్ హాఫ్ అంతా ఫహద్, విజయసేతు పాత్రలు హైలెట్ గా కనిపిస్తాయి. సినిమాలో పాత్రలన్నీ హైలెట్ చేస్తూ చివరికి విక్రమ్ పాత్ర జోడించాడు. ఇది ప్రేక్షకులకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కమల్ కనిపించనప్పటికీ ఇది కమల్ సినిమా కాదనే భావన ఎవరిలోనూ వుండదు. పైగా ఆ పాత్రపై ఇంకా ఆసక్తిపెరుగుతుంది. యాభై ఏళ్ళుదాటిన హీరోలు సినిమా అంతా తామై నడపాలని భావిస్తున్నారు. యంగ్ హీరోయిన్స్, ఐటెం సాంగ్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఐతే కమల్ హీరోయిజం రూల్స్ ని బ్రేక్ రూల్ చేసి కొత్తదారి చూపి విజయాన్ని అందుకున్నారు. మరి కమల్ నేర్పిన ఈ పాఠం ఎంతమంది సీనియర్ హీరోలు ఫాలో అవుతారో చూడాలి.