బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై పోలీసులు కేసు పెట్టారు. మరో వైపు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఆయనపై కేసు పెట్టడం కరెక్టేనంటున్నారు. ఓ రకంగా ఇప్పుడు అన్ని పార్టీలు ఆయనపై దండెత్తుతున్నాయి. దీనంతటికి కారణం రేప్ కేసులో నిందితుల్ని పోలీసులు కాపాడుతున్నారంటూ ఆయన కొన్ని ఫోటోలు , వీడియోలు విడుదల చేశారు. రఘునందన్ విడుద ల చేసిన వీడియోలతోనే పోలీసులు ఎమ్మెల్యే కొడుకు కూడా రేప్ ఘటనలో ఉన్నాడని కేసు నమోదు చేయాల్సి వచ్చింది. లేకపోతే అప్పటికే ఆయనకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చేశారు.
కానీ ఇప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంత సంచలనానికి కారణం అయిన రఘునందన్పై పోలీసులు మైనర్ల వివరాలను బయట పెట్టారంటూ కేసులు పెట్టారు. ఆయనపై కాంగ్రెస్ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు. కేసులు పెట్టడం కరెక్టేనంటున్నారు. ఇక టీఆర్ఎస్, ఎంఐఎం నేతల గురించి చెప్పాల్సిన పని లేదు. అందరూ విరుచుకుపడుతున్నా ఆయనకు బీజేపీ వైపు నుంచి ఒక్క మద్దతు ప్రకటన రావడం లేదు. తూతూ.. మంత్రంగా కూడా స్పందించడం లేదు.
దీతో ఆయన తన వాదన తానే మీడియా చానళ్ల చుట్టూ తిరిగి చెప్పుకుంటున్నారు. తాను ఎవరి ఐడెంటీటీ బయటపెట్టలేదని.. చెబుతున్నారు. తనకు ముఫ్పై ఏళ్ల లాయర్ అనుభవం ఉందని.. గుర్తు చేస్తున్నారు. నిజానికి రఘునందన్ బయట పెట్టి నవీడియో, ఫోటోల్లో ఎవరి ఫేసూ ప్రత్యేకంగా కనిపించడం లేదు. అయినా ఆయనపై కేసులు పెట్టారు. ఆయన పోరాడుతున్నారు. కానీ సొంత పార్టీ నుంచి మద్దతు లభించకపోవడమే చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.