భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయ్యాక నందమూరి తారక రామారావుపై పుస్తకం రాయనున్నట్లు ఎన్వీ రమణ ప్రకటించారు. తిరుపతి లో ఎన్టిఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.. ఈ ఉత్సవాల్లో మేడసాని మోహన్ అవధానంను విక్షించిన అనంతరం వివిధ కళాకారులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఎన్టిఆర్ గురించి ఎంత మాడ్లాడినా తక్కువే అని, ఆయన ఒక సమగ్ర సమతా మూర్తి అని కొనియాడారు.. రైతు బిడ్డగా ,రంగ స్ధల నటుడిగా, కధానాయకుడిగా ,రాజకీయనాయకుడిగా ఆయన అంచెలంచెలుగా ఎదిగారన్నారు.
న్టీఆర్ జనం నాడి తెలిఒఇన వ్యక్తిగా చిరస్ధాయిగా నిలిచి పోతారని చెప్పారు..పాత్టి పెట్టిన దాదాపు తొమ్మిది నెలల్లోనే అధికారం దక్కించుకున్న ఘనత నందమూరి తారకరామారావుకి మాత్రమే దక్కుతుందన్నారు.. ఎన్టీఆర్ తో తనకున్న సన్నిహిత సంబంధాలను ఆయన గుర్తు చేసుకున్నారు.. నాపై ఎన్టిఆర్ మనిషి అని ముద్ర వేశారని, దానికి నేను ఎంతో గర్వీస్తున్నట్లు చెప్పారు.. కాలేజీ చదివే రోజుల్లోనే ఆయన తనను అభిమానించే వారని, 1983లో ఆయన కోసం పరోక్షంగా పని చేశానని చెప్పారు.. సంక్షోభం సమయంలో ఆయన తరుపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదని, కానీ ప్రజాభిమానంతో ఆయన తిరిగి పదవి దక్కించుకున్నారని చెప్పారు.
అప్పట్లో ఎన్టిఆర్ ఢిల్లీకి తీసుకెళ్ళె వారని, ఎన్టీఆర్ కి మందులు అందించేవాడినని ఎన్వీ రమణ గుర్తు చేశారు.. ఎన్టీఆర్ కు వ్యక్తిగత, కుటుంబ విషయాల్లో ఆయనకు న్యాయపరమైన సలహాలు ఇచ్చేవాడిని. ఎన్టీఆర్కు పద్మ, ఫాల్కే వంటి అవార్డులు దక్కకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ విషయంలో తన భావాలను జస్టిస్ రమణ ఏ మాత్రం దాచుకోకుండా వివరించడం సభికులను ఆశ్చర్య పరిచింది.