లోకేష్ బినామీగా వైసీపీ నేతలు ప్రచారంలోకి తెచ్చిన తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి అనే ఇసుక వ్యాపారి, కాంట్రాక్టర్ .. టీటీడీలో తిష్టవేసిన ధర్మారెడ్డి వియ్యంకులవుతున్నారు. ఏపీలో ప్రస్తుతం ఇసుక అంతా ఒకే సంస్థ చేతిలో ఉంది. ఆ సంస్థ తమిళనాడుకు చెందినది. అది శేఖర్ రెడ్డిదే అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తనకు సంబంధం లేదని ఆయన చెబుతున్నారు. గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా ఉండేవారు. టీడీపీ హయాంలో ఆయన ఇంట్లో కొత్త నోట్లు .. కోట్లు దొరకడంతో తీసేశారు. అప్పుడే అందరూ లోకేష్ బినామీ అని ఆరోపించారు.
వైసీపీ నేతలు చెపపారని పవన్ కల్యాణ్ కూడా అదే ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు మహర్దశ పట్టుకుంది. వెంటనే టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. ఇప్పుడు చెన్నైలో టీటీడీ తరపున పనులు చక్కబెట్టే పదవి అనుభవిస్తున్నారు. టీటీడీలో మంచి పలుకుబడి ఆయన అనుకున్న పనులన్నీ అయిపోతాయి. అలాంటిది ఏకంగా టీటీడీ జేఈవో ధర్మారెడ్డితోనే వియ్యమందుంకుంటున్నారు. తిరుమలలో ఎంగేజ్మెంట్ను ఘనంగా నిర్వహించారు. .
ఇప్పుడు ఇంచార్జ్ ఈవో కూడా ధర్మారెడ్డినే. మొత్తానికి టీటీడీ చుట్టూనే తిరిగే.. ఎప్పుడూ టీటీడీనే కావాలనుకునే పెద్దలిద్దరూ… వియ్యంకులవుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగి అయిన ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి నేరుగా టీటీడీలోకి వచ్చేశారు. ఈవో లా మొత్తం చక్కబెట్టేస్తున్నారు.