కడపు కొట్టారు అనే ఊతపదం చాలా సార్లు వినిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో వైసీపీ నేతలు నిఖార్సుగా ఉదాహరణ తీసుకు వచ్చారు. ప్రభుత్వం అన్నం పెడుతున్నప్పుడు పోటీగా తాము పెట్టారు. తమ ప్రభుత్వం రాగానే ప్రభుత్వంతో పాటు తాము పెట్టడాన్ని నిలిపేశారు. నిరుపేదల కడపు కొట్టేశారు. ఇదంతా రాజన్న క్యాంటీన్ల గురించే. అన్న క్యాంటీన్ల అంశం మరోసారి ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. అన్న క్యాంటీన్లు ప్రజల మనసుల్లో ముద్ర వేశాయి. ఆకలి తీర్చాయి. అన్న క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించిన సమయంలో మంచి స్పందన రావడంతో వైసీపీ నేతలు.. నియోజకవర్గాల వారీగా రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు. రోజా సహా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వరకూ పదుల సంఖ్యలో వైసీపీ నియోజకవర్గ స్థాయి నేతలు రాజన్న క్యాంటీన్లు పెట్టారు. అప్పట్లో అన్న క్యాంటీన్లు ఉన్నప్పటికీ వాటి వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని.. తామూ కూడా తక్కువకే భోజనం పెడతామని వారు క్యాంటీన్లు పెట్టారు.
తమ ప్రభుత్వం వచ్చినా.. రూ.ఐదుకే భోజనం ఉంటుందని.. ఆ క్యాంటీన్ల ద్వారా నమ్మకం కలిగించారు. అయితే ఆ నమ్మకాన్ని వైసీపీ నేతలు వమ్ము చేశారు. తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన అన్నక్యాంటీన్లను కొత్త ప్రభుత్వం రాగానే నిలిపివేసింది. వాటితో పాటు రాజన్న క్యాంటీన్లు కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు.. ఎక్కడా వారి క్యాంటీన్లు కూడా నడవడం లేదు. పేదలకు రూ. 5 భోజనం అందుబాటులో లేకుండా పోయింది. అంతే కాదు.. తాము పెట్టిన రాజన్న క్యాంటీన్లనూ మూసేశారు. తాము పెట్టడం లేదు.. ప్రభుత్వం తరపున పెట్టనివ్వడం లేదు.
ఇప్పటికీ టీడీపీ నేతలు పలు చోట్ల అన్న క్యాంటీన్లు పెట్టిన దగ్గరే.. దాతల సాయంతో…భోజన ఏర్పాట్లు చేశారు. ఉపాధి కోల్పోయిన కూలీలకు వీలైనంతగా… కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం.. ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నప్పుడు..పోటీగా క్యాంటీన్లు పెట్టిన వైసీపీ నేతలు.. ఇప్పుడు వాటిని మూసేయడమే కాకుండా… భోజనం పెడుతున్న టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేస్తున్నారు. రాజకీయం అంటే కడుపు నింపడం కాదు.. కడుపు కొట్టడం అంటే ఇదేనేమో..?