కేఏ పాల్‌ను హౌస్ అరెస్ట్ చేస్తారని ఎవరైనా అనుకుంటారా ? కానీ పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఆయన ఎక్కడకు వెళ్తే అక్కడకు వెంటపడుతున్నారు. తెలంగాణ అమరవీరుల కేంద్రంగా ఆయన చేస్తున్న రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ ్వుతోంది. ఆమర వీరుల కుటుంబసభ్యులను ఆయన చేరదీస్తున్నారు. వారికి టిక్కెట్లు ఇస్తానని ఖర్చులు పెట్టుకుంటానని చెబుతూండటంతో ఆయన దగ్గరకు అమరవీరుల కుటుంబాలు వస్తున్నాయి. ఇది టీఆర్ఎస్కూ ఇబ్బందికరంగా మారింది.
తెలంగాణ మలి దశ ఉద్యమం ఊపందుకోవడానికి కేసీఆర్ ఆమరణదీక్షతో పాటు ఎల్బీనగర్ సర్కిల్లో శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకోవడం కూడా ఓ కారణం. తెలంగాణ ఉద్యమమంలో ఆయనది ఓ ప్రత్యేకమైన పాత్ర. అందుకే శ్రీకాంతాచారి తల్లిదండ్రులకు గుర్తింపు ఉంది. ఆయన తల్లి శంకరమ్మ హుజూర్నగర్ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ టీఆర్ఎస్ గెలిచేటప్పుడు ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆ శ్రీకాంతాచారి తండ్రి కేఏ పాల్ పార్టీలో చేరిపోయారు. తన పార్టీ తరపున తొలి టిక్కెట్ ఆయనకేనని ప్రకటించారు.
దీనిపై శ్రీకాంతాచారి తల్లి మండి పడుతున్నారు. మా ఆయనకు మందు పెట్టి కేఏపాల్ తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. శ్రీకాంతాచారి తండ్రి పాల్‌తోనే ఉంటున్నారు. ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. శంకరమ్మ కేసు పెట్టడంతో పోలీసులు పాల్ ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. శ్రీకాంతాచారి తండ్రి తాను.. పాల్ దగ్గరే ఉంటానని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. పాల్ టీఆర్ఎస్ను ఓ రేంజ్లో చికాకు పెడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.