సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఇచ్చింది. ఆయనను స్టేషనరీ అండ్ ప్రింటింగ్ డిపార్టుమెంట్‌కు కమిషనర్‌గా నియమించింది. జెమినీ సినిమా తరహాలో ఆయనను అలా ప్రింటింగ్ – స్టేషనరీ గుట్టల మధ్య సర్వీస్ కొనసాగించాలని సూచించింది. అయితే ఈ పోస్టింగ్ అంతా ఆషామాషీగా ఇవ్వలేదు. రెండేళ్ల పాటు సుదీర్ఘంగా పోరాడి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నా రెండు నెలల పాటుఖాళీగా ఉంచారు.
మరోసారి ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి ఢిల్లీకి వెళ్లారని తెలిసిన తర్వాత హడావుడిగా పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత నెల రోజుల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మరో నెలకు కూడాపోస్టింగ్ ఇవ్వలేదు. ఈ మధ్యలో రెండు, మూడు సార్లు సీఎస్‌కు లేఖ రాశారు. సస్పెన్షన్ ఎత్తి వేసినా జీతం.. పోస్టింగ్ ఇవ్వడం లేదని ఆరోపించారు.
ఇలాంటి పరిస్థితుల్లో తప్పని సరిగా పోస్టింగ్ ఇవ్వకపోతే ఇరుక్కుపోతామన్న ఉద్దేశంతో … అధికారులు చివరికి అతి లీస్ట్ లూప్ లైన్ ఉద్యోగం కేటాయించారు. అయితే ఏదైనా ఏబీ వెంకటేశ్వరరావు పోరాడి పోస్టింగ్ సాధించుకున్నారు. ఇక ముందు ఎలా ఉంటుందో కానీ ఈ విషయంలో ప్రభుత్వంపై ఆలస్యంగానైనా ఏబీవీ విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అనేక సార్లు తాను ఎవరినీ వదిలి పెట్టబోనని ఆయన చాలెంజ్ కూడా చేశారు.