తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు ఇటీవలి కాలంలో దూకుడైన భాషతో కలకలం రేపుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల భాషతో పోటీ పడుతున్నారు. తాజాగా చోడవరంలో నిర్వహించిన మినీ మహనాడులోనూ అదే భాషాప్రయోగం చేశారు. సీఎం జగన్ సహా వైసీపీ నేతలందరిపైనా తిట్ల దండకం చదివారు. అయ్యన్నను వైసీపీ నేతలు అదే స్థాయిలో తిడుతున్నారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి చాలా ఎక్కువగా తిడుతున్నారు. ఆ కోపం మొత్తాన్ని జగన్ పై కూడా అయ్యన్నపాత్రుడు చూపించినట్లుగా ఉన్నారు.
అయితే అయ్యన్న ఇలా మాట్లాడటానికి ప్రత్యేకమైన కారణాలున్నాయన్న చర్య నడుస్తోంది. వైసీపీని ఆ పార్టీ అధినేతను రెచ్చగొట్టాలన్న వ్యూహాన్ని అమలుచేస్తున్నారని అంటున్నారు. రాజకీయాల్లో ఆలోచన లేకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలే రివర్స్ అవుతాయి. అలాంటి తప్పులు చేయించడానికే ఇతర పార్టీలు ప్రయత్నిస్తూంటాయి. జగన్ మనస్థత్వం తెలుసు కాబట్టి ఆ దిశగా అయ్యన్న పాత్రుడు తీరిక లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే అయ్యన్నపై పలు కేసులు పెట్టారు. కొన్ని సార్లు అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఎలాగైనా అయ్యన్ను జైలుకుపంపించాలనే ఆలోచన చేస్తారని.. చేయాలని ఇలా రెచ్చగొడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఏం చేయాలనుకున్నా.. దానికి రివర్స్ వ్యూహంతో టీడీపీ రెడీగా ఉందన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో ఉన్నాయి. వైసీపీ నేతలు తిట్టిన తిట్లతో పోలిస్తే అయ్యన్న పాత్రుడిది బెటరేనని… కొంత మంది టీడీపీ వర్గాలు అంటున్నాయి.