ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఈ సారి పారిస్ టూర్ పెట్టుకున్నారు. తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఆయన సీబీఐ కోర్టులో మరోసారి పిటిషన్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే స్విట్జర్లాండ్‌లో మూడు రోజులు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులోనూ.. ఆ తర్వాత వారం రోజులు హాలీడే ట్రిప్ ముగించి వచ్చారు. ఈసారి పూర్తిగా వ్యక్తిగత పర్యటన మీదుగా పారిస్ వెళ్తున్నారు.
పారిస్‌లోని ఓ ప్రసిద్ధ బిజినెస్ స్కూల్లో సీఎం జగన్ పెద్దకుమార్తె హర్షా రెడ్డి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చదువుతున్నారు. ఆ కోర్సుపూర్తి కావడంతో గ్రాడ్యూయేషన్ సెర్మనీ ఉండటంతో ఆ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి..సతీసమేతంగా పారిస్ వెళ్లాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. హర్షారెడ్డి ప్యారిస్ వెళ్లేటప్పుడు సీఎం జగన్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి సెండాఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఆమె గ్రాడ్యూయేషన్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ చిన్న కుమార్తె కూడా లండన్‌లోనే చదువుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల జగన్ సోదరి షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి అమెరికాలోని యూనివర్శిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ సెర్మనీలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల , అనిల్ కుమార్, వైఎస్ విజయమ్మ కూడా వెళ్లారు. మరి హర్షారెడ్డి గ్రాడ్యూయేషన్ సెర్మనీకి విజయమ్మ కూడా వెళ్తారో లేదో !