రాహుల్ గాంధీపై ఈడీ కక్ష సాధిస్తోందంటూ.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ఆందోళన రివర్స్ అయింది. కొంతమంది నేతల అతి వల్ల ముఖ్య నేతలు కేసుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. ఈడీ తీరుకు నిరసనగా చలో రాజ్ భవన్కు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ ముట్టడించకుండా పోలీసులు ఆపుతారనితెలుసు కాబట్టి కొత్తగా ఆలోచించారు. తెల్లవారుజామునే ఎన్ఎస్యూఐ విద్యార్థులు ముట్టడించారు. ఆ తర్వాత పది గంటల సమయంలో ఇతర నేతలు ముట్టడించారు. దీంతో పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
అది దారి తప్పింది. బారికేడ్లు తప్పించి… మరీ నేతలు దూసుకెళ్లారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఓ మహిళా ఎస్ఐని డొక్కలో తన్నడమే కాదు.. మరో ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు. టచ్ చేస్తే స్టేషన్కు వచ్చి కొడతానని హెచ్చరించారు. మల్లు భట్టి విక్రమార్క కూడా ఓ డీసీపీ కాలర్ పట్టుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. కాంగ్రెస్ కార్యకర్తలపై ఇష్టం వచ్చినట్లుగా లాఠీచార్జ్ చేసిన పోలీసులు అందర్నీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. పలు సెక్షన్ల కిందకేసులు పెట్టారు.
చివరికిరేవంత్ రెడ్డిపై కూడా కేసులు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి ఆందోళనలు అన్ని పార్టీలు చేస్తాయి.. వారిని పోలీసులు స్టేషన్లకు తరలించి వదిలేస్తారు. కేసుల్లాంటివి పెట్టరు. కానీ ఇక్కడ పోలీసులపైనే రుబాబు చూపించడంతో కేసుల పాలవ్వాల్సి వచ్చింది.