ఆత్మకూరులో బీజేపీ ఏ చాన్సునూ వదిలి పెట్టకూడదని అనుకుంటోంది. చివరికి జయప్రదనూ రంగంలోకి దింపుతోంది. స్టార్ క్యాంపెయినర్‌గా ఆమెను ఆత్మకూరులోప్రచారంలోకి తిప్పాలని నిర్ణయించారు. ఇటీవల ఏపీ రాజకీయాల్లో జయప్రత క్రియాశీలకంగా మారేందుకు సిద్ధమయ్యారు. రాజమండ్రిలో బీజేపీ సభలోనూ పాల్గొన్నారు. వైఎస్ఆర్‌సీపీ పాలనపై విమర్శలు చేశారు. తున్నారు. తాను పుట్టిన గడ్డను ఎప్పటికీ మరచిపోనని చెప్పారు జయప్రద. ఇప్పుడామె ఆత్మకూరు ప్రచారానికి రాబోతున్నారు.
వైసీపీ తరపునరోజా ఇప్పటికే అక్కడ చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. ఆమెకు ఓ మండలం బాధ్యతలుకూడా ఇచ్చారు. ఆమెకు పోటీగా జయప్రదను సోము వీర్రాజు రంగంలోకి దింపుతున్నారు. ఆత్మకూరులో బీజేపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్ రంగంలోకి దిగారు. ఆయన స్థానికేతరుడు. పలు పేర్లు వినిపించినా చివరికి ఎవరూ మొగ్గు చూపకపోవడంతో స్థానికేతరుడైన భరత్ కుమార్ ని రంగంలోకి దింపారు.
అయితే అభ్యర్థితోపాటు నాయకులెవరూ పెద్దగా ప్రచారానికి వెళ్లట్లేదు. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. వైసీపీ కూడా పదిమంది మంత్రులను రంగంలోకి దింపింది. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఓ మంత్రి వచ్చారు, ఆయనతోపాటు మరో ఇన్ చార్జి ఎమ్మెల్యే కూడా ఉన్నారు. వీరికి తోడు జిల్లా మంత్రి, ఇన్ చార్జి మంత్రి.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వస్తున్నారు.