టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫామ్‌హౌస్‌లోనే బీఆర్ఎస్పై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా ప్రణాళిక సిద్ధమయింది. పార్టీ ని ప్రకటించే ముందు కార్యవర్గంలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అందు కోసం కేసీఆర్ రెండు రోజుల్లో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఒకటి, రెండు సార్లు పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ముందస్తు ఎన్నికలు ఉండవని ఓ సారి క్లారిటీ ఇచ్చారు. ఈ సారి మాత్రం కీలక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.
తెలంగాణ తరహాలో దేశాన్ని అభివృద్ధి చేయడానికి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేందుకు కార్యవర్గం అనుమతి కేసీఆర్ తీసుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ఇప్పటికే ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందినందున పార్టీ పేరు మార్చితే గుర్తు మారే అవకాశం ఉండదుని అలాగే.. పేరు మార్పు వల్ల ఎలాంటి సమస్య రాదని వివరించే అవకాశం ఉందని వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో ఇక పార్టీ క్యాడర్ ఇంటింటికి వెళ్లాల్సిన అవశ్యకతను వివరించి కొత్త కార్యక్రమాలు చేపట్టే ప్రణాళికను వివరిస్తారని అంటున్నారు.
ఇటీవల పీకే పలు రకాల సర్వేలు చేసి నివేదికలు ఇచ్చారు. వాటిని బయట పెట్టకపోయినప్పటికీ.. ఆ సర్వేల ఆధారంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా కేసీఆర్ పార్టీ క్యాడర్‌కు ఇచ్చే అవకాశ ంఉంది. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత తెలంగాణను నిర్లక్ష్యం చేసి జాతీయర ాజకీయాలపై దృష్టి పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. జాతీయ పార్టీని ప్రకటిస్తే టీఆర్ఎస్ పై ఏ విధంగా అభిమానం ఉందో అదే అభిమానం ఉండేలా చూసుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే కేసీఆర్ జాగ్రత్తగా అడుగులేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.