మెగా హీరోల్లో తనకంటూ ఓ ఇమేజ్‌ని సంపాదించుకొన్నాడు సాయిధరమ్ తేజ్. డాన్సుల్లో ఈజ్ ఉండడం, చిరు పోలికలు కొట్టొచ్చినట్టు కనిపించడం… తనకు ప్లస్ అయ్యాయి. ఓ దశలో వరుసగా హిట్లు కొట్టాడు. కానీ ఆ తరవాత ట్రాక్ తప్పింది. వరుసగా అరడజను ఫ్లాపులు పకలరించాయి. చిత్రలహరితో కాస్త కోలుకొన్నాడు. ప్రతిరోజూ పండగేతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. మళ్లీ రిపబ్లిక్ దెబ్బకొట్టింది. సోలో బతుకే సో బెటరు… యూత్ ఫుల్ స్టోరీనే అయినా, తేజ్ లోని స్కిల్స్‌ని పూర్తి స్థాయిలో బయటకు తీసుకురాలేకపోయింది. ఇప్పుడు తేజ్‌కి కావల్సింది తన స్టామినాకు తగిన కథలు. ఆ దారిలో ఓ అడుగు ముందుకేశాడు. సంపత్ నంది కథకు తేజ్ ఓకే చెప్పాడు. సంపత్ ది మంచి కమర్షియల్ మీటర్. మినిమం గ్యారెంటీ ఉంటుంది. హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ కూడా బాగా రాసుకుంటాడు. తేజ్‌కి కావల్సింది ఇలాంటి కథే. పైగా ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెడుతున్నారని, తేజ్ కెరీర్లో అత్యంత ఖరీదైన చిత్రమిదేనని టాక్.
మరోవైపు వినోదయ సీతమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు తేజ్. పవన్ కల్యాణ్‌తో తెర పంచుకోవడం కంటే, తేజ్‌కి హ్యాపీ మూమెంట్ ఏముంటుంది? పైగా రీమేక్ తో పోలిస్తే… తెలుగులో తేజ్ పాత్ర పరిధి చాలా పెరిగిందట, ఆ పాత్రకు ప్రాధాన్యత బాగా ఇస్తున్నార్ట. మేనల్లుడు తేజ్ అంటే… పవన్‌కి వల్లమాలిన అభిమానం. కాబట్టి.. లెంగ్త్ పరంగా పవన్‌కి కూడా ఇబ్బందులు ఉండవు. ఈ రెండు సినిమాలూ సాయిధరమ్ తేజ్ కెరిర్ కి చాలా ముఖ్యం. యాక్సెడెంట్ తరవాత అదుపు తప్పిన తన సినిమా బండిని.. మళ్లీ ట్రాక్‌లో పెట్టగలిగే ప్రాజెక్టులు ఇవి. మరి ఈసారైనా బండి కుదురుకుంటుందా?