తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి ఆస్పత్రిలో చేరారు. మోకీలు ఆపరేషన్ చేయించుకున్నారు. మరో వైపు కేసీఆర్ జాతీయ పార్టీ కసరత్తును ఇంకా పూర్తి చేయలేదు. దీంతో బీఆర్ఎస్ ప్రకటన ఆలస్యం కానుంది. అది రెండు నెలల వరకూ కావొచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్కు సెంటిమెంట్స్ ఎక్కువ. మంచి రోజు లేనిదే కీలకమైన పని చేపట్టరు. ఈనెల 30వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఆషాఢ మాసంలో మంచి పనులను ప్రారంభించకూడదనేది ఒక సెంటిమెంట్. ఆప్రకారం చూస్తే వచ్చే నెలలో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉండకపోచవ్చని చెబుతున్నారు.
నెలాఖరులోపు ప్రకటించడానికి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం పెట్టి తీర్మానం చేయాలి. ఆ తర్వాత ఢిల్లీలో అసలు విషయం ప్రకటించాలి. ఇప్పటికింకా టీఆర్ఎస్, బీఆర్ఎస్ కన్ఫ్యూజన్ తొలగిపోలేదు. కొత్తగా పెట్టబోయే జాతీయ పార్టీ ఏ షేప్లో ఉంటుందనే అంశంపై టీఆర్ఎస్ సీనియర్లకూ స్పష్టత లేదు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రశాంత్ కిషోర్, ప్రకాశ్ రాజ్ తదితరులతో రోజుల తరబడి సుదీర్ఘంగా కేసీఆర్ చర్చలు జరిపారు. ప్రత్యామ్నాయ ఎజెండా పేరుతో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతోనూ సమావేశమయ్యారు.
టీఆర్ఎస్ సీనియర్ లీడర్లతోనూ జాతీయ రాజకీయాల్లో పోషించాల్సిన పాత్రపై లోతుగా చర్చించారు. టీఆర్ఎస్ పార్టీని కొత్తగా పెట్టే జాతీయ పార్టీలో విలీనం చేయడమా? లేక టీఆర్ఎస్ పార్టీనే జాతీయ పార్టీగా మార్చడమా? అన్నది కేసీఆర్ తేల్చుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల హడావిడి మొదలుకావడంతో జాతీయ పార్టీపైన చర్చలు, తదుపరి కార్యాచరణకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. అంటే మరో రెండునెలల పాటు ఎలాంటి డెలవప్మెంట్స్ ఉండవని చెబుతున్నారు.