ఉప్పెనతో సూపర్ హిట్ కొట్టేసింది కృతి శెట్టి. తొలి అడుగులోనే అందరికీ నచ్చేసింది. ఆ తరవాత వెనక్కి తిరిగే చూసుకొనే అవకాశమే రాలేదు. ఇప్పుడు యువ హీరోల సినిమా అంటే కృతి పేరే ముందుగా పరిశీలిస్తున్నారు. తాజాగా నాగ చైతన్య సినిమా కోసం కృతిని హీరోయిన్ గా తీసుకొనే ఛాన్సుందని టాక్. నాగచైతన్య – వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో కథానాయికగా కృతి పేరు పరిశీలిస్తున్నారు. చైతూ – కృతిశెట్టి జంటగా నటించడం ఇదే తొలిసారి కాదు. ఇది వరకు బంగార్రాజు కోసం ఇద్దరూ జోడీ కట్టారు. ఆ సినిమా హిట్టయ్యింది. అందుకే హిట్ సెంటిమెంట్ ని ఈ సినిమాలోనూ కొనసాగించాలని భావిస్తున్నారు. `మానాడు`తో తన స్టామినా నిరూపించుకొన్నాడు వెంకట్ ప్రభు. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామనుకొన్నారు. ఆ రీమేక్ కూడా వెంకట్ ప్రభు చేతికే అప్పగిద్దామనుకొన్నారు. అయితే వెంకట్ ప్రభు ఈసారి మరో కొత్త కథతో మెస్మరైజ్ చేయాలన్న ఉద్దేశంతో… నాగచైతన్య కోసం కొత్త కథ రాసుకొన్నాడు. ఇది కూడా థ్రిల్లర్ జోనర్లోనే సాగబోతోందని టాక్.