ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సిటీ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. కాపు , మత్య్సకారులు మెజార్టీగా ఉన్న ఈ సామాజికవర్గంలో రెడ్డి వర్గానికి చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన ధన బలం… సిటీలో అల్లరి చిల్లరగా తిరిగే యువతను చేరదీసి ప్రైవేటు సైన్యంగా మార్చుకుని చేస్తున్న రౌడీయిజంతో సిటీని గుప్పిట్లో పెట్టుకున్నారు. నియోజకవర్గం మొత్తం ఆయన గుప్పిట్లోనే ఉంటుంది. అయితే ఒక సారి భయపడతారు… రెండు సార్లు భయపడతారు.. కానీ ప్రతీ సారి భయపడే పరిస్థితి లేదని ఇప్పుడిప్పుడే ఆ నియోజకవర్గంలో వస్తున్న మార్పులను చూసి అర్థమైపోతుదంి.
కాకినాడ సిటీలో ప్రధాన రాజకీయ పార్టీలు కాపు అభ్యర్థులకే చాన్సిస్తాయి. కానీ జగన్‌తో ఉన్న వ్యక్తిగత, వ్యాపార లావాదేవీల కారణంగా ఎప్పటికప్పుడు ద్వారంపూడి కాకినాడ టిక్కెట్ తనకే తెచ్చుకుంటున్నారు. పీఆర్పీ తరపున అభ్యర్థి పోటీ చేసినప్పుడు భారీగా ఓట్లు చీలి గెలిచారు. మళ్లీ జనసేన పోటీ చేసినప్పుడు మళ్లీ ఓట్లు చీలి గెలిచారు. టీడీపీకి జనసేన మద్దతిచ్చినప్పుడు టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఈ సమీకరణాలు చూస్తే.. పూర్తిగా జనసేన పార్టీ ఎవరి వైపు నిలిస్తే వారిదే విజయం అని అర్థం చేసుకోవచ్చు. జనసేన విడిగా పోటీ చేస్తే మాత్రం అది మరోసారి వైసీపీకి ప్లస్ పాయింట్‌గా మారడం ఖాయం.
ద్వారంపూడి .. తన అధినేత జగన్‌ను మెప్పించడానికి ఇటీవలి కాలలో పెద్ద ఎత్తున పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. పచ్చి బూతులుతిట్టారు. దీంతో కాపు సామాజికవర్గంలో ఆయనపై ఓ రకమైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇతర వర్గాల్లోనూ ఆయన తీరుపై అసంతృప్తి కనిపిస్తోంది. గడప గడపకూ వెళ్తున్న ఆయనను కొంత మంది ప్రశ్నించేందుకు భయడపడటం లేదు. భయపెట్టి ఓట్లు వేయించుకోగలమన్న నమ్మకం కూడా సన్నగిల్లుతోంది. మరో వైపు ఓట్లు వేసే వర్గాలు కూడా తగ్గిపోయాయని ఆయనకు తెలిసొచ్చింది. అయితే జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేస్తే ఎలాగానా గెలిచేస్తాననే నమ్మకంతో ఉన్నారు. అయితే ఆయన ప్లాన్ బీ కూడా చూసుకుంటున్నారు. ఈ సారి ఆనపర్తి నియోజకవర్గంపై కన్నేశారు. పులివెందుల తర్వాత అత్యధిక రెడ్డి వర్గం ఓట్లు ఉన్న నియోజకవర్గం ఆనపర్తినే.
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల్లో ఒకటి అంటూ కాకినాడ సిటీ కూడా ప్రచారంలో ఉంది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తే అది జనసేనకు అడ్వాంటేజ్ అవుతుంది. ద్వారంపూడి పోటీ చేసినా విజయం సులువు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ద్వారంపూడి విషయంలో పవన్ కల్యాణ్ కూడా సీరియస్‌గానే ఉన్నారు. తమ పార్టీ నేతల్ని బూతులు తిట్టడం మాత్రమే కాదు.. రౌడీయిజం చేస్తున్నారని ఆయనపై పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఓ సారి నేరుగా కాకినాడ వెళ్లారు కూడా. పవన్ ధైర్యం చేసి కాకినాడ నుంచి పోటీ చేస్తే… ఆ సీటు జనసేన ఖాతాలో పడే చాన్స్ ఉందన్న అంచనాలు ఉన్నాయి.