వైసీపీలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నేతలపై ఫృధ్వీరాజ్ అలియాస్ ఫృధ్వీరాజ్ ఎలా విరుచుకుపడేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు స్క్రిప్ట్ పై నుంచి వచ్చేది. అందుకే చంద్రబాబు.. పవన్ అని చూడకుండా రెచ్చిపోయేవాడు. వైసీపిని సమర్థించడం అంటే… ఎదుటి పార్టీ వాళ్లను తిట్టడమే అన్నట్లుగా రాజకీయం చేశారు.వైసీపీలో ఆయనకు బాగానే ఉండి ఉన్నట్లయితే.. .అదే కంటిన్యూ చేసేవారు. కానీ ఆయనను పక్కకు తోసేశారు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీంతో అటు సినిమాల్లో చాన్సులు.. ఇటు రాజకీయ ఆశలు అన్నీ పోగొట్టుకుని నడిరోడ్డుపై నిలబడ్డారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెదుక్కోవాలన్న ఉద్దేశంతో నేరుగా తెరపైకి వస్తున్నారు.
రాజకీయాల్లో తాను తగ్గలేదని.. వైసీపీ పట్టించుకోకపోతే.. వారు నేర్పిన విద్యతో.. తాను రాజకీయ అవకాశాలను వెదుక్కోగలనని నిరూపిస్తున్నారు. ఇప్పటి వరకూ యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇచ్చి కాస్త పద్దతిగా మాట్లాడిన ఆయనను ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆర్కే నేరుగా ఓపెన్ హార్ట్‌కు పిలిచారు. అంత పెద్ద ఇంటర్యూకు పిలవడమే గొప్ప అని అనుకున్న ఫృధ్వీ చెలరేగిపోయినట్లుగా కనిపిస్తోంది.
వైసీపీలో బూతులు ఎలా తిట్టాలో ట్రైనింగ్ ఇస్తారో.. ఎంత దారుణంగా అక్కడ పరిస్థితులు ఉంటాయో మొత్తం ఆర్కేకు చెప్పినట్లుగా తెలుస్తోంది. వైసీపీని ఉగ్రవాద సంస్థగా చెబుతున్నారు. అందులో తాను ఉన్నప్పుడు తనను కూడా ఉగ్రవాదిగానేచెప్పుకున్నారు. చూడబోతుంటే.. వైసీపీపై ఫృధ్వీరాజ్తో ఆర్కే పెద్ద బాంబే వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం ప్రసారమయ్యే ఈ ఓపెన్ హార్ట్‌లో ఇంకెన్ని సంచలనాలు ఉంటాయో వేచి చూడాలి. ఇప్పటికే రికార్డు అయిపోయింది కాబట్టి వైసీపీ నేతలు కూడా చేయగలిగిందేమీ లేదు.