తెలంగాణ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఏటా ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తులను ప్రకటించి .. వాటిపై ఆమోదముద్ర ఉన్నతాధికారుల నుంచి వేయించుకోవాలిట. లేకపోతే అక్రమాస్తులుగా గుర్తిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఓ ఉపాధ్యాయుడు ఉద్యోగం మానేసి రియల్ ఎస్టేట్‌తో పాటు ఇతర వ్యాపారాలు చేస్తూ టైం పాస్ చేసుకుంటున్నట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. విచారణ చేశారు. నిజంగానే టీచర్ గా ఉద్యోగ విధుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వ్యాపారాలు చేసుకుంటున్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులు కూడా బెట్టాడు. దీంతో విద్యాశాఖకు కోపం వచ్చింది. వెంటనే ఆస్తుల ప్రకటన నిర్ణయం తీసుకుంది.
ఒక్క టీచర్ అలా చేశారని అందరూ అలా చేస్తారా అనే డౌట్ మిగతా వాళ్లకు వస్తుంది. అయితే చాలా మంది టీచర్లు అదే పని చేస్తున్నారని సరిగ్గా పాఠాలు చెప్పడం లేదన్న ఫీడ్ బ్యాక్ అన్ని చోట్లా ఉంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే టీచర్లు ఉద్యోగ విధులను మాత్రమే నిర్లక్ష్యం చేస్తారు.. కానీ అవినీతికి పాల్పడరు. పాల్పడే అవకాశం కొద్ది మందికే ఉంటుంది. వ్యాపారాలు చేస్తారు.. ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అందుకే విద్యాశాఖ ఆస్తుల ప్రకటన ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరూ.. ఉద్యోగాన్ని లంచాల మయంగా చేసేశారు. రెవిన్యూ వంటి కీలక శాఖల్లో అటెండర్ ఇంట్లో సోదాలు జరిపిన కోట్ల ఆస్తులు కనిపిస్తూంటాయి. ఆర్థిక వ్యవహారాలు.. ప్రజా సేవలు ఎక్కువగా జరిగే శాఖల్లో యితే ఈ లంచాల పర్వం ఎక్కువ. మరి టీచర్లపై వచ్చినంత కోపం ఈ అధికారులపై ఎందుకు రాదనేది అర్థం కాని విషయం. ఒక్క విద్యాశాఖ ఉద్యోగులు ఎందుకు అందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఇదే చేయిస్తే.. లంచం సమస్య పరిష్కారనికి ఓ ప్రయత్నం చేసినట్లుగా ఉంటుది