నాని ఇప్పుడు కాస్త డౌన్ లో ఉన్నాడు. వరుసగా అన్నీ ఎదురు దెబ్బలే. ఇప్పుడు తన ఆశలన్నీ `దసరా`పైనే ఉన్నాయి. శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. బడ్జెట్ కూడా భారీగా కేటాయించారు. అయితే.. నాని వరుస ఫ్లాపుల దృష్ట్యా.. `దసరా` బడ్జెట్లో కోత పడుతుందని వార్తలొస్తున్నాయి. అందుకే నాని కూడా కాస్త ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాడని టాక్.
ఈ సినిమాపై నాని చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. కథపై కూడా నానికి బాగా గురి కుదిరింది. ఖర్చు పెట్టి తీయాల్సిన సినిమా ఇది. బడ్జెట్ లో కోత విధిస్తే… క్వాలిటీ దెబ్బ తింటుంది. అందుకే నాని తన పారితోషికాన్ని వదులుకొంటున్నాడని టాక్. బదులుగా ఈ సినిమా నిర్మాణంగా భాగం పంచుకోబోతున్నాడని తెలుస్తోంది. సినిమా అంతా పూర్తయ్యాక, జరిగిన బిజినెస్‌ని బట్టి.. అప్పుడు పారితోషికం తీసుకోవాలని నాని డిసైడ్ అయ్యాడట. నిజంగా మంచి మూవ్ ఇది. తన సినిమా తనకు కావల్సినట్టు వస్తుంది, లాభాలొస్తే.. నాని తీసుకొనే పారితోషికమూ బాగా పెరుగుతుంది. ఈమధ్య ప్రొడక్షన్ లో చేరి, నాని కూడా నిర్మాతగా మారబట్టి.. నిర్మాతల వైపు నుంచి కూడా ఆలోచించడం మొదలెట్టాడన్నమాట.