`లైగర్`తో పూరి – విజయ్ దేవరకొండల జోడీ కుదిరింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. `లైగర్` రాకుండానే… `జనగణమన` మొదలెట్టి ఓ కొత్త సంప్రదాయానికి తెర లేపాడు పూరి. ఓ సినిమా చేతిలో ఉండగానే… మరో సినిమా మొదలెట్టిన దర్శకుడు, హీరో.. వీళ్లిద్దరేనేమో..? అయితే ఇప్పుడు తమ రికార్డుని తామే బద్దలు కొట్టుకుంటూ…. ముచ్చటగా మూడో సినిమా కూడా చేసేయబోతున్నారు.
అవును.. `జనగణమన` పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండతో పూరి మరో సినిమా చేయబోతున్నాడు. `జనగణమన` చివరి దశలో ఈ కొత్త ప్రాజెక్టు ప్రకటించబోతున్నారని టాక్. మూడో సినిమాకి సంబంధించినచ కథ కూడా పూరి ఆల్రెడీ సిద్ధం చేసేశాడని, `జనగణమన` చివరి దశలో ఉండగానే.. ఈ ప్రాజెక్టు ప్రకటించి, పట్టాలెక్కించేస్తారని తెలుస్తోంది. `జనగణమన` చేస్తూనే విజయ్ `ఖుషీ` సినిమానే మొదలెట్టాడు. అలానే… పూరితో మూడో సినిమా చేస్తున్నప్పుడే.. మరో సినిమా కూడా సమాంతరంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి ఒకే హీరోతో.. వరుసగా మూడు సినిమాలు చేసిన ఘనత మూటగట్టుకొన్నాడు పూరి. మళ్లీ ఇలాంటి మ్యాజిక్ చూడలేమేమో..?