వైసీపీ పార్టీకి అనుబంధ సంఘాల ప్రకటించారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విభాగాలకు మాత్రం ఆయా వర్గాలకు ఇచ్చారు. ఇతర వాటిని మాత్రం తమ ఆస్థాన సామాజికవర్గనికి ఇచ్చారు. మొత్తం 24 విభాగాలకు బాధ్యులను ప్రకటించారు. కీలకమైన విభాగాలకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నాగిరెడ్డి, పూనూరు గౌతంరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కల్పలతా రెడ్డి, మేడపాటి వెంకట్ రెడ్డి, సునీల్ పోశింరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి నియమితులయ్యారు.
ఇందులో ఐటీ, సోషల్ మీడియా, పార్టీ ఆఫీస్, యూత్ వింగ్, రైతు విభాగం ఇలా అన్నీ కవర్ అయ్యాయి. ఇక ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, బీసీ, ఎస్టీ, ఎస్టీలకు తప్పని సరిగా వారికే ఇవ్వాలి కాబట్టి అవకాశం కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు ప్రాధాన్యత లేనివి ఇస్తారు. విధులు..నిధులు ఉండని చెబుతూ ఉంటారు. పార్టీ వ్యవహారాల్లోనూ అంతే. పనేమీ ఉండని పదవులు ఇతర వర్గాలకు కేటాయించారు. అదే సమయంలో ఓసీ అంటే.. వైసీపీకి ఒక్క రెడ్లు మాత్రమే. ఇతర వర్గాలు కనిపించవు. ఆ పరిస్థితి పార్టీ పదవుల్లోనూ కనిపించింది.
వయోభారంతో కదల్లేని స్థితికి చేరిన ఉమ్మారెడ్డికి క్రమశిక్షణా సంఘం పదవి కొనసాగింపు ఇచ్చారు. ఈ సంఘం చేసేదేమీ ఉండదు. సజ్జల నిర్ణయాలు తీసుకుంటారు. ఆ మాటకొస్తే అనుబంధ సంఘాల్లో సోషల్ మీడియా విభాగానికి తప్ప దేనికీ ప్రాధాన్యం ఉండదు. ఇందులో నలుగుర్ని నియమిస్తే.. ముగ్గురు రెడ్డి సామాజికవర్గం వారే ఉన్నారు. ఆ ఒక్కరిని కూడా నియమించకపోతే ఏమైనా అనుకుంటారేమో అని నియమించినట్లుగా ఉంది. వైసీపీ సర్కార్ సామాజిక న్యాయం చేస్తామని చెబుతూ ఉంటుంది. ఆ మేరకు చేస్తోంది. అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత.