సినియర్ హీరోయిన్ నటి మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. గత కొన్నిరోజులుగా విద్యాసాగర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉందని, గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. జనవరిలో మీనా కుటుంబం మొత్తం కొవిడ్ బారిన పడింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైంది. అయితే డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది.
మీనా- విద్యాసాగర్లది పెద్దలు కుదిర్చిన వివాహం. సౌత్ లో స్టార్ హీరోలతో పని చేసిన మీనా.. కెరీర్లో రాణిస్తోన్న తరుణంలోనే బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విద్యాసాగర్‌తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. జులై 12, 2009లో వీరి వివాహం జరిగింది. వీరికి నైనికా అనే కుమార్తె ఉంది.