లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన”హ్యాపీ బర్త్ డే” ట్రైలర్ ని లాంచ్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సందర్భంగా ఆయన ప్రేక్షకులు థియేటర్ కి రావడం అనే అంశంపై తన విశ్లేషణ చెప్పారు. ”జనాలు థియేటర్ కి రావడం లేదనే మాట వినిపిస్తుంది. అయితే ఏది చేసిన సంపూర్ణంగా చేస్తే ప్రేక్షకులు థియేటర్ కి వస్తారని నా విశ్లేషణ. కామెడీ చేస్తే జనాలు ఇరగబడి నవ్వేలా వుండాలి, ఫైట్స్ వున్న సినిమా తీస్తే గ్రేటెస్ట్ యాక్షన్ చూపించాలి. కానీ హాఫ్ హార్టడ్ గా సినిమాలు తీస్తుంటే జనాలు రావడం లేదు, సంపూర్ణంగా తీస్తే జనాలు వస్తారని భావిస్తున్నా. ‘హ్యాపీ బర్త్ డే’ కొత్త కాన్సెప్ట్. ఈ సినిమాని హాఫ్ హార్టడ్ గా కాకుండా పరిపూర్ణంగా తీశారు దర్శకడు రితేష్ రానా. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పడానికి కారణం ఇదే” అన్నారు రాజమౌళి.
ఇదే సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ పై తనదైన శైలిలో ప్రసంసలు కురిపించారు. మైత్రీ మూవీ మేకర్స్ గోల్డ్ డిగ్గర్స్. ఎక్కడ తవ్వితే బంగారం దొరుకుతుందో వాళ్ళకి బాగా తెలుసు. ఎక్కడిక్కడ మంచి ప్రాజెక్ట్లు ఉంటాయో సరిగ్గా పట్టుకుంటారు. మరో గోల్డ్ మైన్ ని పట్టుకున్న మైత్రీ మూవీ మేకర్స్, మరో నిర్మాణ భాగస్వామి క్లాప్ ఎంటర్టైన్మెంట్ కి కంగ్రాట్స్’ చెప్పారు రాజమౌళి.