ఏపీలో ప్రభుత్వం ఎంత మూర్ఖంగా ఉందో .. తాము అనుకున్నదే నిజం అని నమ్మించడానికి దేనికైనా సరే తెగబడిపోతోందని మరోసారి నిరూపితమయింది. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ వైర్లు తెగిపడిన ఘటనలో ఐదుగురు కూలీలు సజీవ దహనం అయ్యారు. ఉడత కొరికితేనే వైర్ తెగిందని విద్యుత్ అధికారులు ప్రకటించారు. దానిపై విమర్శలు వచ్చాయి. దాంతో అదే నిజమని నిరూపించేందుకు ముందూ వెనుకా చూసుకోకుండా ఉడుతకు పోస్టు మార్టం చేయాలని నిర్ణయించారు. చేసేశారు. పరీక్షల్లో ఏం తేలిందో నివేదిక ఇస్తారు.
అయితే ఉడుతకు పోస్టుమార్టం చేయడం ఏమిటో అసలు పోస్టుమార్టంలో ఏం తేలుస్తారో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఉడుత వైర్లను కొరకలేదని సులువుగా తెలుసుకోవచ్చు. హై టెన్షన్ వైర్లు మెషిన్‌తో కట్ చేసినా తెగనంత గట్టిగా ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అదే సమయంలో హైటెన్షన్ వైర్లు రెండింటిని ఒకే సారి తాకి కరెంట్ సరఫరా అయ్యేలా చేయడం వల్ల తెగాయని కూడా చెప్పలేరు. ఎందుకంటే కరెంట్ స్తంభం పైన ఉడత చనిపోయి ఉంది.
అలా కలిసి ఉంటే ఆ ఉడుత కూడా బూడిదగా మారిపోయేదని కనీసం బుర్ర ఉన్నవారికైనా తెలుస్తుంది. చేయాల్సింది ఉడతకు శరవరీక్ష కాదని.. విద్యుత్ తీగల నాణ్యాతా పరీక్ష అని నిపుణులు చెబుతున్నారు. అంత నాసిరకంగా ఉన్నాయా లేదో నిపుణుల చేత వైర్లను పరీక్షింప చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం ఎలా ఉందో.. అధికారులూ అలాగే ఉన్నారు. ఉడతదే తప్పని తేల్చడానికి సాకులు వెదుక్కుంటున్నారు.