దర్శకుడు హరి మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ‘సింగం’ ఆయన సక్సెస్ఫుల్ సిరిస్. ఈ సిరిస్ కి తెలుగులో కూడా ఆకట్టుకుంది. హరికి ఎప్పటి నుండో నేరుగా ఒక తెలుగు సినిమా చేయాలనీ వుంది. ఎట్టకేలకు ఆయన తెలుగు సినిమా పట్టాలెక్కబోతుంది. హీరో గోపీచంద్ దర్శకుడు హరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
నిజానికి ఈ కథ ఎన్టీఆర్ కి చెప్పారు హరి. ఎన్టీఆర్ కి ఈ కథ చాలా నచ్చింది. కానీ ఎన్టీఆర్ లైనప్ చాలా పెద్దగా వుంది. ఎన్టీఆర్ డేట్స్ రావడానికి మూడేళ్ళు సమయం పడుతుంది. ఇదే విషయాన్ని హరికి చెప్పారు ఎన్టీఆర్. అయితే హరి వెంటనే తెలుగు సినిమా చేయాలని వుంది. వెంటనే ఈ కథని గోపిచంద్ కి చెప్పారు. గోపిచంద్ కి కథ నచ్చింది. కాంబినేషన్ ఫైనల్ అయ్యింది. గోపిచంద్ కి మాస్ ఇమేజ్ వుంది. ఈ కథ గోపిచంద్ ఇమేజ్ కి కూడా పక్కాగా సరిపొతుందని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన అధికారిక ప్రకటన రానుంది.