ఇంగ్లాండ్తో జరుగుతోన్న ఐదో టెస్టు టీమ్ఇండియా సంచలనమైన ఇన్నింగ్ ఆడింది. 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 416పరుగులు చేసింది. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా ఆరో వికెట్కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి సంచలనం సృష్టించారు. తొలి రోజు రిషభ్ పంత్ (146) సెంచరీ సాధించగా, రెండో రవీంద్ర జడేజా (104) సెంచరీతో ఆకట్టుకున్నాడు.
రెండో రోజు మరో రికార్డ్ కూడా వుంది. చివరి వికెట్ గా క్రీజులోకి వచ్చిన బుమ్రా (31 నాటౌట్; 16 బంతుల్లో ) సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్ వేసిన 84వ ఓవర్లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో ఏకంగా 35 పరుగులు రాబట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 16పరుగులకు ఒక వికెట్ కోల్పోయి 400 పరుగుల వెనుకంజలో వుంది.