బీజేపీ ఇద్దరు ఎంపీలతో ప్రారంభించి ఇప్పుడు దేశవ్యాప్తంగా తిరుగులేని శక్తిగా ఉందని జనసేన ప్రస్థానం కూడా అలాగే ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ధ్ ధీమావ్యక్తం చేశారు. దేశంలో మతం, కులం ప్రస్తావన లేని రాజకీయాలు రావాలన్నారు. జనసేన క్రియాశీలక వీర మహిళల రాజకీయ అవగాహన తరగతుల సందర్భంగా పవన్ మాట్లాడారు. ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం వచ్చే వరకు బీజేపీ పోరాటం చేసిందని . ఏ పార్టీ ప్రారంభమైనా చిన్నగానే ఉంటుందన్నారు.
తమ భాష, యాసను గౌరవించడం లేదనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఒకరి భాష, యాసను మరొకరు గౌరవించాలని పవన్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న విధ్వంసాన్ని సరిచేస్తూ అభివృద్ధి చేయాలన్నారు. విజయవాడలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించనున్నారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకోనున్నారు.
ముందస్తు ఎన్నికల సూచనలు ఉండటంతో పవన్ కల్యాణ్ వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దసరా వరకూ అన్ని సినిమాల కమిట్మెంట్లు పూర్తిచేసి.. అప్పట్నుంచి యాత్ర ప్రారంభించాలనుకుంటున్నారు. అప్పటి వరకూ జనవాణి నిర్వహిస్తారు. పొత్తుల విషయంపై గతంలో చర్చ జరిగినా.. ఇప్పుడు వాటి గురించి ప్రస్తావించడం తగ్గించేశారు.