ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పోలీసు అధికారులు తాము రెయిడింగ్‌లో పట్టుకున్న మద్యాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించారు. దానికి పెద్దత్తున కవరేజీ వచ్చేలా మీడియాను పిలిచి హంగామా చేస్తున్నారు. దాన్ని చూస్తున్న వారికి ఆ మద్యం ఏమైనా ప్రాణాంతకమా ? ఎందుకలా ధ్వంసం చేస్తున్నారు ? అనే డౌట్ సహజంగానే వస్తోంది. అక్కడ వాటిని ఏమైనా నిషేధించారా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే.. గంజాయి లేదా డ్రగ్స్ లేకపోతే ఇంకో నిషేధిత పదార్థాలు స్మగ్లింగ్ చేస్తే పట్టుకుని ఇలా ధ్వంసం చేస్తారు. కానీ అక్కడ పోలీసులు ధ్వంసం చేస్తున్న మద్యం క్వాలిటీ బ్రాండెడ్ లిక్కర్.
ప్రపంచంలో ఎక్కడా ఆ లిక్కర్‌ను బ్యాన్ చేయలేదు. అంత ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారికంగా బ్యాన్ చే్యలేదు. అనధికారికంగా అమ్మకుండా చేశారు. అక్కడ లెక్క వేరు. అక్కడ అన్నీ ఏ మాత్రం క్వాలిటీ లేని మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వాటిని మాత్రమే కొనాలి. అయితే ధర ఎక్కువ ని.. సరైన బ్రాండ్ దొరకలేదని.. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చుకునే మద్యానికి డిమాండ్ ఉంది. ఈ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున స్మగ్లర్లు ఏపీలోకి ఆ మద్యం తెచ్చి అమ్ముకుంటున్నారు.
ఇలా తీసుకొస్తున్న వాటిని పట్టుకున్న పోలీసులు ఇప్పుడు ధ్వంసం చేస్తున్నారు. పట్టుకోవడం వరకూ ఓకే కానీ.. దాన్ని ధ్వంసం చేయడం ఎందుకనేదే ప్రశ్న. దాన్ని ఏం చేయాలో తెలియక ధ్వంసం చేస్తున్నారని అంటున్నారు. కోర్టుల్లో ఏం తేలుతుందో పోలీసులు ఇలా మద్యం ధ్వంసం చేయడాన్ని గొప్ప ఘనకార్యకార్యంగా మీడియా కవరేజీకి ప్రయత్నించడం మాత్రం వివాదాస్పదమవుతోంది.