2020 నాటికి ప్రామాణికంగా తీసుకున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.. ఈవోడీబీ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానానికి వచ్చిందని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రం స్టార్టప్స్ ఎకో సిస్టం బాగున్న రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ ర్యాంకుల్లో ఏపీ చిట్ట చివరన నిలిచింది. మన కంటే బీహారే నయమని ర్యాంకులు ప్రకటించారు. ఏ కేటగిరిలో గుజరాత్, కర్ణాటక అగ్రస్థానంలో నిలిచాయి. బి కేటగిరిలో మేఘాలయ అగ్రస్థానంలో నిలిచింది. ఏ కేటగిరి అంటే కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు, బీ కేటగిరి అంటే కోటి కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు.
కేటగిరి ఏలో గుజరాత్, కర్ణాటక తర్వాత తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అసోం , బీహార్, ఆంద్రప్రదేశ్ వరుసగా నిలిచాయి. కోటి కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో చివరి స్థానంలో లద్దాఖ్ నిలిచింది.ఆ చిన్న రాష్ట్రాలను కూడా కలిపి ర్యాంకింగ్‌లు ఇస్తే.. ఏపీ లద్దాఖ్ కన్నా ఘోరంగా ఉంటుందేమో తెలియదు. ప్రపంచం మొత్తం ఇప్పుడు స్టార్టప్స్ వెంట నడుస్తోంది. సీఎం జగన్ కూడా సమీక్షలు పెట్టి బెస్ట్ స్టార్టప్ ఎకో సిస్టమ్ మన దగ్గర ఉండాలని అధికారులను ఆదేశిస్తూ ఉంటారు.
ఆ ఆదేశాలుఎలా ఉన్నాయో కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏపీ దిగజారిపోయింది. ఒకప్పుడు టెక్ ప్రపంంచలో వెలుగు వెలిగిన ఏపీ విభజన అయిన తర్వాత ఐదేళ్లు ఎంతో కొంత పురోగతి చూపించినా గత మూడేళ్ల నుంచి పూర్తిగా నాశనమైపోయింది. చివరికి బీహార్ కంటే దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఏపీలో మామూలు వ్యాపారేలే చేసుకోలేరు.. ఇక స్టార్టప్‌ల గురించి ఏం ఆలోచిస్తారని ఈ ర్యాంకుల మీద కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి.
States & UTs across India have strengthened their startup policy framework over the 3 editions of the States’ Startup Ranking.
Best Performers, Top Performers, Leaders & Aspiring Leaders categorised on the basis of feedback for the reforms carried out.#Startups4NewIndia pic.twitter.com/BBwNTQ5koN
— Piyush Goyal (@PiyushGoyal) July 4, 2022