భీమవరంలో మోదీ సభ విజయవంతంగా ముగిసింది. ఈ సభకు చిరంజీవిని ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. చిరుకి ఆహ్వానం అందడం వెనుక బలమైన సమీకరణాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే.. ఈ వేడుకకు కృష్ణ లాంటి దిగ్గజాలను పిలవకపోవడం ఏమిటన్నది ఇంకొందరి ప్రశ్న. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా.. వెండి తెరపై ఆ పాత్రని అద్భుతంగా పోషించిన కృష్ణని ఆహ్వానిస్తే బాగుండేదని చెప్పుకుంటున్నారు. నిజానికి కృష్ణకు ఈ వేడుకకు రమ్మని ఆహ్వానం అందినట్టు సమాచారం. కృష్ణతో పాటుగా కృష్ణంరాజునీ పిలిచారని సమాచారం. కృష్ణంరాజు ముందు నుంచీ బీజేపీ మనిషి. పైగా భీమవరంలో ఆయన సామాజిక వర్గం బలంగా ఉంది. అయితే ఆరోగ్య కారణాల వల్ల.. వీరిద్దరూ ఈ సభకు హాజరవు అవ్వలేదని తెలుస్తోంది. కృష్ణ ఇప్పుడు ఇదివరకటిలా ఉత్సాహంగా లేరు. వయసు మీద పడుతోంది. ఆయన లేచి నడవలేని పరిస్థితి. ఇలాంటప్పుడు అంత పెద్ద క్రౌడ్‌లో జరిగే వేడుకకి వెళ్లడం అంత మంచిది కాదు కూడా. కృష్ణంరాజుదీ ఇదే పరిస్థితి. ఇటీవలే ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆయన కూడా చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. అందుకే.. కృష్ణంరాజు కూడా వెళ్లలేదని తెలుస్తోంది.