పేరు జాతీయ మీడియా కానీ వాటి స్టాండర్డ్స్ మాత్రం సోషల్ మీడియా ట్రోలర్స్ కన్నా దారుణంగా ఉంటాయి. తాజాగా జీ గ్రూప్‌కు చెందిన రోహిత్ రంజన్ అనే యాంకర్‌ను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిజానికి ఈయన నిర్వహించే డీఎన్ఏ అనే ప్రోగ్రాంలో రాహుల్ గాంధీ మాటలను దారుణంగా వక్రీకరించి ప్రసారం చే్శారు. రాహుల్ గాంధీపై నిందలేశారు. కేరళ లో పర్యటిస్తన్న సమయంలో తన ఆఫీసుపై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తల్ని పిల్లలు.. వదిలేయండి అని అంటే.. ఆ వ్యాఖ్యలు ఉదయ్ పూర్లో టైలర్ హంతకుల్ని ఉద్దేశించి అన్నట్లుగా మార్చేసి హంగామా చేశారు.
జీ వ్యవహారం మీడియా రంగంలోనే కలకలం రేపింది. జీ సీఈవో రాజీనామా చేశారు.ఆ షో నడిపిస్తున్న రాజీవ్ రంజన్ దేశం మొత్తం తమను ఊస్తోందని గుర్తించి క్షమాపణలు చెప్పారు. కానీ ఉద్దేశపూర్వకంగా చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ లీగల్ యాక్షన్ ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న చత్తీస్ ఘడ్లో కేసులు పెట్టి ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారు. నోయిడాలో ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే బీజేపీ పాలనలో ఉన్న యూపీ పోలీసులు వారి కంటే ముందు తాము అరెస్ట్ చేశారు. చత్తీస్ ఘడ్ పోలీసులు తీసుకెళ్తే ఎక్కడ సమస్యలు వస్తాయోనని అలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అసలు రాహుల్ గాంధీ గురించి తప్పుడు ప్రచారం చేయడం ఎందుకు.. ఇలా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పాలిత రాష్ట్రాల పోలీసుల చేతుల్లో అరెస్ట్ కావడం ఎందుకన్న ప్రశఅనలు వస్తున్నాయి. జాతీయ మీడియా అత్యంత దారుణంగా మారిపోయింది.కేంద్రాన్ని సమర్థించడమే కాదు.. ఇతర పార్టీల్ని కించత పరిచేందుకు .. వాటిపై ఫేక్ న్యూస్‌లు ప్రసారం చేసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు.