కేంద్రం వివక్ష ఆపకపోతే ప్రత్యేక దేశం ఉద్యమం వస్తుందని డీఎంకే నేతలు హెచ్చరిస్తున్న సమయంలో బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. తెలంగాణను రెండు రాష్ట్రాలుగా విభజించగలమని తమకు ఆ అధికారం ఉందని బీజేపీ నేతలు ప్రకటించారు. బీజేపీ నేతలకు కౌంటర్‌గా అంటున్నారా లేకపోతే నిజంగానే తమిళనాడును విభజించే ఉద్దేశం ఉందా అన్నదానిపై ఇప్పుడు ఆ రాష్ట్రంలో చర్చలు ప్రారంభమయ్యాయి. తమిళనాడుకు దేశంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమే కాదు సంస్కృతిలోనూ స్పష్టమైన తేడా ఉంది.
తమిళంపై వారు చూపే మక్కువ తక్కువ కాదు. పరాయి భాషలపై మోజు పడితే ఎక్కడ తమిళానికి ఇబ్బంది అవుతుందోనని హిందీ లాంటి భాషలపై వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు. ఈ హిందీ వ్యతిరేకత బీజేపీ వంటి పార్టీలకు ఏ మాత్రం నచ్చడం లేదు. అందుకే తమిళనాడులో బలపడలేకపోతున్నామన్న భావన ఉంది. తెలుగు రాష్ట్రాలను విడగొట్టిన తర్వాత తెలంగాణలో బీజేపీ పుంజుకుంది.
ఈ కారణంగా తమిళనాడునూ విభజిస్తే ఎంతో కొంత పార్టీకి మేలు జరుగుతుందని ఆశిస్తే మటుకు .. విభజన బీజాన్ని మొక్కగా పెంచి మానుగా చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీకి దయాదాక్షిణ్యాలు ఉండవని గతంలోనే తేలిపోయింది. అయితే ఇప్పుడు బీజేపీ ట్రాప్‌కు తమిళులు పడతారా ప్రాంతీయంగా విడిపోతారా లేకపోకే సమైక్యను మళ్లీ సమైక్యంగా చూపుతారా అన్నది కాలమే నిర్ణయించాలి.