ఈమధ్య తమిళ హీరోల దృష్టి టాలీవుడ్ పై పడింది. ధనుష్, విజయ్ స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. శివకార్తికేయన్ సినిమా కూడా ఒకటి సెట్స్‌పై ఉంది. ఇప్పుడు మరో సినిమాని ఆయన ఒప్పుకొన్నాడు. ఈ చిత్రానికి `సోగ్గాడే చిన్నినాయిన`, `బంగార్రాజు` చిత్రాలతో ఆకట్టుకొన్న కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. జ్ఞానవేల్ రాజా నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ రూ.20 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు టాక్. కల్యాణ్ కృష్ణకు ఈ ఆఫర్ అందడం మామూలు విషయం కాదు. `సోగ్గాడే.. ` తరవాత ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. `బంగార్రాజు` సంక్రాంతి హడావుడిలో కొట్టుకుపోయింది. ఈ దశలో… భారీ ప్రాజెక్టుని పట్టుకోగలిగాడు. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.