చంద్రబాబు చేతికి ఓ ఉంగరం కనిపించింది. అంతే.. కొన్ని రకాల మీడియాకు పండగైపోయింది. ఆ ఉంగరం ఎందుకు పెట్టుకున్నారు ? అనే దగ్గర నుంచి ప్రారంభించి.. ఎన్నికల వరకూ తీసుకెళ్లి చివరికి మహారాజుల జాతకాలకు లింక్ పెట్టేశారు. అబ్బా ఈ రింగ్‌లో అంత కథ ఉంటుందా అని .. మొత్తం విడమర్చి చెప్పేవాళ్లను ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు. చంద్రబాబు ఏ వేలికి ఉంగరం పెట్టుకున్నారు.. ఎందుకు పెట్టుకున్నారు… అలా ఎందుకు పెట్టుకున్నారంటూ కథలుకథలుగా చెబుతున్నారు. త్వరలో వేణు స్వామి లాంటి వాళ్లతో డిబేట్లు కూడా ఆర్గనైజ్ చేసేలా ఉన్నారు.
అయితే చంద్రబాబు వాచీలు, ఉంగరాలు లాంటి వాటిని పెట్టుకోరు. మరి ఇప్పుడెందుకు పెట్టుకున్నారని ఎక్కువ మందికి డౌట్ వస్తోంది. అయితే ఆ ఫోటోలను కాస్త పరిశీలనగా చూసిన వారికి.. ఆయన ఉంగరంగాపెట్టుకున్న రింగ్ అనబడే వస్తువును పరిశీలన చూసిన వారికి కాస్త డౌట్ రావడం సహజం. ఎందుకంటే అది బంగారం కాదు.. ప్లాటినం కాదు. మరేంటి ?., చాలా మందికి తెలియదు కానీ.. ఇప్పుడు వేళ్లకు పెట్టుకునే ఫిట్ నెస్ బ్యాండ్స్ వచ్చాయి.
అలాంటి ఫిట్‌నెస్ బ్యాండ్‌ను చంద్రబాబు తన వేలికి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఆరోగ్య పరంగా ఎంతబిజీగా ఉన్నా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంత వ్యాయమం చేశారు..ఎంత కెలోరీలు ఖర్చయ్యాయి దగ్గర్నుంచి ఆ బ్యాండ్ లాంటి రింగ్ పెట్టుకుంటే చాలా వరకూ శరీరంలో జరిగిన మార్పుల గురించి స్పష్టత వస్తుందంటున్నారు. ఈ విషయం తెలియక చాలా మంది జాతకాల .. నమ్మకాలు…అంటూ ఎక్కడికో వెళ్లిపోతున్నారు.