జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్టూన్లతో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. వరుసగా ఒక్కో సమస్యపై జగన్ సర్కార్ వైఫల్యాన్ని వివరించేలా కార్టూన్ పెడుతున్నారు. తాజాగా ఆయన పిల్లల స్కూళ్లను మూసేస్తున్న వైనంపై కార్టూన్ పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. జగన్ తనను తాను పిల్లలకు మామయ్యగా చెప్పుకుంటూ ఉంటారు. అ మాటతో .. బడులు మూసేస్తున్న వైనంపై కార్టూన్ వేయించారు. ముద్దుల మామయ్య కాదు దొంగ మామయ్యని బడిని ఎత్తుకెళ్తున్నారని పిల్లలు కోపంగా చూస్తూండటాన్ని కార్టూన్‌గా వేయించి తన ఖాతాలో పోస్ట్ చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2022
అన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు జూన్‌లో ప్రారంభమయ్యాయి. కానీ ఏపీలో మాత్రం జూలైలో ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమయ్యే సరికి ఎనిమిది వేల స్కూళ్లు లేవు. అన్నింటినీ సమీపంలో విలీనం చేశారు. విద్యార్థులు లేరని కారణం చూపించారు. ప్రభుత్వ స్కూళ్లలో పెద్ద ఎత్తున జనం చేరుతున్నారని చెబుతున్న ప్రభుత్వం స్కూళ్లను మాత్రం మూసేస్తోంది. అయితే విలీనం చేస్తున్నారని స్కూళ్లను ఎత్తివేయడం లేదని ప్రభుత్వం అతి తెలివి సమాధానాలు చెబుతోంది.
#Apjobcalendar pic.twitter.com/j6dTEBOz6F
— Pawan Kalyan (@PawanKalyan) July 7, 2022
పవన్ కల్యాణ్ గురువారం… నిరుద్యోగ సమస్యపై కార్టూన్‌ను పోస్ట్ చేశారు. జాబ్ క్యాలెండ్ చేతిలో పెట్టి జాబుల్లేకుండా చేసిన విషయాన్ని అందులో వివరించారు. మద్య నిషేధంపైనా ఇలాంటి కార్టూనే పోస్టు చేశారు. ఖరీదైన మద్యాన్ని నిషేధించామని అంటే బ్రాండెడ్ లిక్కర్ నిషేధించామని ఓ వైసీపీ నేత వాదిస్తున్న వైనం వివరించారు. కార్టూన్లు వేస్తోంది ఎవరో కానీ మంచి లైన్‌తో వేస్తున్నారు. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి. ప్లీనరీ సందర్భంగా నరవత్నాల్లోని లోపాలను ప్రశ్నిస్తూ .. .నవ సందేహాలను కూడా పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రయత్నానికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2022