రాజకీయ పార్టీ అంటే సొంత సంస్థ కాదు. వ్యాపారసంస్థ అసలే కాదు. రాజ్యాంగం ప్రకారం కొన్ని నిబంధనల ప్రకారం… ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండటానికి ఓ ఏర్పాటు. ఈసీ నిర్దేశించిన ప్రకారం ప్రతి ప్రతీ పార్టీకి సంస్థాగత ఎన్నికలు జరగాలి. ఆ వివరాలను సమర్పించాలి. అంటే ప్రతి రెండేళ్లకు మాత్రమే అధ్యక్షుడు ఎన్నికవుతారు. ఆ తర్వాత రకరకాల మినహాయింపులతో పొడిగించుకోవచ్చు.. ఎన్నికలు జరపకపోయినట్లుా జరిపినట్లుగా.. సృష్టించుకోవచ్చుకానీ ఇక ఏ అవసరం లేకుండా తననే శాశ్వత అధ్యక్షుడిగాఎవరైనా ప్రకటించుకుంటే అది నిబంధనలకు విరుద్ధమే. అయితే సీఎం జగన్ ఆ ఫీట్ సాధించేశారు. వైసీపీ ప్లీనరీలో జగన్ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి జగన్ కూడా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
అసలు ఈ నిర్ణయంలో కార్యకర్తల పాత్ర ఏమీ లేకపోయినా.. వాళ్లే ఎన్నుకున్నట్లుగా జగన్ కలరింగ్ ఇచ్చారన్నమాట. ఈ అంశంపై ఎవరో ఒకరు కోర్టుకెళ్తారు. ఎవరో వెళ్తే పట్టించుకోరు కానీ.. ఆ పార్టీ వాళ్లు వెళ్తేనే సమస్య. ఇలాంటి వాటిపై న్యాయపోరాటం చేయడానికి రఘురామ లాంటి వాళ్లు రెడీగా ఉంటారు. ఇతరవైసీపీ నేతలెవరూ వెళ్లకపోవచ్చు. రఘురామ అధికారికంగా ఆ పార్టీ ఎంపీ. సస్పెండ్ కూడా చే్యలేదు. ఇప్పటికే రఘురామ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమిస్తే కోర్టుకె్ళ్తానని అంటున్నారు.
అయితే ఇక ముందు తూ తూ మంత్రంగా జరిగే ఎన్నిక కూడా వద్దని ఎందుకు తననే శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ప్రకటించుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముందు ముందు తన పార్టీని ఎవరు స్వాధీనం చేసుకోకుండా ఇలా చేస్తున్నారని కొంత మందిఅంటున్నారు. అంత ధైర్యం ఎవరికి ఉందని మరికొంత మంది ఆలోచిస్తున్నారు. కానీ రాజకీయంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి జగన్ ఇలా ముందు జాగ్రత్తపడ్డారని పిస్తోందని అంటున్నారు. మొత్తానికి జగన్ ఎవరూ ఊహించని … ఇలా కూడా చేయవచ్చా అని అనుకునే నిర్ణయాలు తీసుకోవడంలో ఓ ట్రెండ్ సెట్టర్ అని మరోసారి నిరూపితమైంది.