మాచర్ల నియోజక వర్గం టీజరు, ప్రచార చిత్రాలూ… ఓకే అనిపించినా, ఇంకా ఏదో కావాలనిపించింది. ఆ లోటు పూర్తి చేయడానికి అంజలి వచ్చేసింది. నితిన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అంజలి ఓ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.. `రా రా రెడ్డీ… ఐయామ్ రెడీ` అంటూ సాగే గీతమిది. ఈపాట ఈరోజు విడుదలైంది. ఈ పాటకు తీసుకొన్న లీడ్ లోనూ.. డబుల్ మీనింగులు దంచి కొట్టారు.
”ఏ అబ్బాయ్ నువ్వు రెడీ యేనా” అని ఓ అమ్మాయి అడిగితే…
”నువ్వుండమ్మా.. సర్దుకోని.. అసలే తీసి చాన్నాళ్లయ్యింది…” అని ఆయన ఆన్సర్ చెబుతాడు.
”ఏంటదీ” అని అమ్మాయి సరసమాడితే..
”హార్మోనియం పెట్టెలే..” అని సమాధానం వస్తుంది. ఇలాంటిదే మరో ముతక జోకు. ఆ తరవాత.. అంజలి బరిలోకి దిగడం, నితిన్ తో స్టెప్పులు వేయడం జరిగిపోయాయి. మంచి బీటున్న మాస్ పాట ఇది. లిప్సిన సాహిత్యం వేడి వేడిగా.. సాగిపోయింది. మహతి క్యాచీ ట్యూన్ ఇచ్చాడు. స్టెప్పులు ఎప్పటిలానే అదిరిపోయాయి. అంజలిని ఇలా హాట్ హాట్‌గా చూడడం అరుదూన విషయమే. మొత్తానికి మాచర్లకు ఈ పాటతో కొత్త వేడి వచ్చినట్టైంది. ఇక మున్ముందు ప్రమోషన్ల జోరు పెంచాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.