మంచు విష్ణు నుండి చాన్నాళ్ళుగా సినిమా రాలేదు. ఇప్పుడు ఆయన ‘జిన్నా’ అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో సూర్య అనే డైరెక్టర్ పరిచయం అవుతున్నాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కోన వెంకట్ కథ అందిస్తున్నారు. గతంలో కోన, విష్ణు కాంబినేషన్లో వచ్చిన ఢీ, దేనికైనా రెడీ చిత్రాలు విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ బయటికి వచ్చింది. డీవోపీ చోటా కే నాయకుడు, దర్శకుడు సూర్య అందరూ సెట్స్ లో విష్ణు కోసం ఎదురు చూస్తుండగా ”జిన్నా” అని పిలిస్తే విష్ణు యాక్షన్ స్టంట్ తో ఎంట్రీ ఇవ్వడం ఫస్ట్ లుక్ లో చూపించారు. ఈ టీజర్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ బావుంది. ఈ సినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్ రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. దాన్నే షార్ట్ కట్ లో జిన్నా అనే టైటిల్ గా పెట్టారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.