తెలంగాణ ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల తేదీని ప్రకటిస్తే అసెంబ్లీని రద్దు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే అసెంబ్లీని రద్దు చేయకుండా ఎన్నికల తేదీని ప్రకటించడం సాధ్యం కాదు. బీజేపీ నేతలు అనధికారిక ప్రకటన చేయాలి. ఈ మేరకు అమిత్ షా ఎప్పులో క్లారిటీ ఇచ్చారు. దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని కూడా సవాల్ చేశారు. ఈ ప్రకారం రెండు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నారు . దీన్ని పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి.
ఇతర పార్టీలు కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్‌ను స్వాగతించాయి. దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని అంటున్నాయి. నిజానిని ఎన్నికల సన్నాహాలను దాదాపుగా అన్ని పార్టీలు ప్రారంభించాయి. కేసీఆర్ తన అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఈ సారి ప్రశాంత్ కిషోర్‌కు ఇచ్చేశారు. ఆయన టీం సర్వేల మీద సర్వేలు చేస్తోంది. అభ్యర్థులపై ఓ నిర్ణయాన్ని ఇవ్వనుంది. ఇక కేసీఆర్ కేసీఆర్ ఎన్నికలకు వెళ్లాలంటే .. పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధమవుతారు. అవన్నీ అంతర్గతంగా జరిగిపోతూ ఉంటాయి. అవి కూడా పూర్తయిపోయి ఉంటారని భావిస్తున్నారు.
అయితే కేసీఆర్ పరిస్థితి ఏ మాత్రం వ్యతిరేకంగా ఉందని అనుకున్నా ముందస్తుకు వెళ్లరని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితిని అధ్యయనం చేసి ఎప్పుడు మేలు జరుగుతుందనుకుంటే అప్పుడు మాత్రమే వెళ్తారని అంటున్నారు. ఈ విషయంలోకేసీఆర్ వ్యూహమే ఫైనల్ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సవాళ్లు జరుగుతున్నా… ముందస్తు ఎన్నికల చాన్స్ ఫిఫ్టీ .. ఫిఫ్టీ మాత్రమేనంటున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు పూర్తి స్థాయిలో ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి.