నెలకో సినిమా తీసి పారేస్తున్నాడు వర్మ. మొన్నామధ్యే `కొండా` తీశాడు. యధావిధిగా ఫ్లాప్. ఇప్పుడు `అమ్మాయి` అనే సినిమా తీశాడు. దీని స్పెషాలిటీ ఏమిటంటే, దీన్ని చైనాలోనూ రిలీజ్ చేస్తున్నాడు. వందా, రెండొందల థియేటర్లలో కాదట. ఏకంగా 50 వేల థియేటర్లలోనట. ఓ తెలుగు సినిమా.. చైనాలో 50 వేల థియేటర్లలో విడుదల కావడం ఏమిటని అడిగితే వర్మ చాలా లెక్కలే చెబుతున్నాడు.
“ఇండియాలో తెరకెక్కించిన తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమా ఇది. చైనాకు సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీతో కలిసి ఈ సినిమా తెరకెక్కించాం. ఇందులో చైనా నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా పనిచేశారు. చైనాలో కొంతమేర షూటింగ్ చేశాం. ఈ సినిమా అక్కడి డిస్టిబ్యూటర్లకు బాగా నచ్చింది. అందుకే చైనాలో ఈ సినిమాని 50 వేల థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు“ అంటున్నాడు. మన బాహుబలి, ఆర్.ఆర్.ఆర్‌లాంటి సినిమాలే.. 50 వేల థియేటర్లలో విడుదల చేయలేదు. వర్మ తీసిన లోకాస్ట్ సినిమా `అమ్మాయి`ని రిలీజ్ చేస్తారంటే నమ్మాలా? మార్షల్ ఆర్ట్స్ సినిమాలు మనకు కొత్తేమో. చైనా వాళ్లకు కాదు. అక్కడ ఇలాంటి కతలు చాలా చూసేశారు. ఇప్పుడు కొత్తగా చూసేదేముంది? మొత్తంగా చూస్తే, ఇది వర్మ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్‌లా కనిపిస్తోంది. అంతే.