రామ్ తన కెరీర్లో తొలిసారి పోలీస్పాత్ర పోషించిన చిత్రం `ది వారియర్`. గురువారం ఈ సినిమా విడుదల కానుంది. పోలీస్ గెటప్పులో రామ్.. అదిరిపోయాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే, ఇందులో రామ్ డాక్టర్ కూడా. అదేంటి? ఒకే వ్యక్తి డాక్టర్, పోలీస్ ఎలా అవుతాడు? అనుకుంటున్నారా? అదే ట్విస్టు.
ఈ కథలో రామ్ డాక్టరే. కాకపోతే… తన ముందు జరిగిన అన్యాయాన్ని ఓ డాక్టర్ గా ఎదుర్కోలేకపోతాడు. అదే పోలీస్ గా మారితే, సమాజాన్ని మార్చొచ్చు అనే నిర్ణయం తీసుకొని, అప్పుడు పోలీస్ అవుతాడు. ఆ తరవాత.. ఏం జరిగిందన్నదే కథ. ట్రైలర్లో.. డాక్టర్లా రామ్ ప్రిస్కిప్షన్ చదవడం చూసే ఉంటారు. అది.. ఈ సినిమాలో రామ్ మేనరిజం.
రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. అందులో… చరణ్ కలెక్టర్గా కనిపించనున్నాడు. నిజానికి తను… ఐపీఎస్. తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ఐఏఎస్ గా మారతాడు. ఆ కథలో అదో ట్విస్ట్. అలా.. ఒకే సినిమాలో రెండు వృత్తులు ఎంచుకొని, కథా గమనాన్ని మార్చేస్తున్నారు హీరోలు. ఇది కొత్త ట్రెండేమో..?