దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీతారామంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు. ప్రతి పాత్ర వినూత్నంగా పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు. ఇందులో రష్మిక మందన్న కీలక రోల్ పోషిస్తుంది. కాశ్మీరీ ముస్లిం అమ్మాయి అఫ్రీన్ గా రష్మిక చేస్తున్న పాత్ర సీతారామం కథలో చాలా కీలకం కానుంది. ఇప్పటికే విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ అందరినీ సర్ప్రైజ్ చేసింది. సీతారామంలోని మరో సర్ప్రైజ్ హీరో సుమంత్. ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా కనిపించబోతున్నారు సుమంత్. తాజాగా విడుదలైన సుమంత్ ఫస్ట్ లుక్ టాక్ అఫ్ టౌన్ గా నిలిచింది.
ఇప్పుడు తరుణ్ భాస్కర్ వంతు వచ్చింది. తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రను బాలాజీగా పరిచయం చేశారు. ఈ లుక్ లో కూల్ డ్రింక్ తాగుతున్న తరుణ్ భాస్కర్ చాలా ట్రెండీగా కనిపించారు. తరుణ్ భాస్కర్ మంచి నటుడు కూడా. ఆయన పాత్రల ఎంపిక కూడా విలక్షణంగా వుంటుంది. అలాంటి తరుణ్ భాస్కర్ సీతారామంలో భాగం కావడం ఆసక్తికరంగా వుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.