పోలవరం ప్రాజెక్ట్ అంటే అసెంబ్లీలో అనిల్ చేసిన సవాళ్లే గుర్తుకు వస్తాయి. కమెడియన్ స్థాయిలో ఆయనచేసిన డైలాగుల్ని టీడీపీ ట్రోల్ చేసింది. ఎందుకంటే ఆయన సవాళ్లన్నీ తేలిపోయియి ఇలాంటి హామీతోనే మాజీ మంత్రి అనిల్ కూడా తెరపైకి వచ్చారు. తన నియోజకవర్గంలో పెన్నాకు వరదలు వచ్చినప్పుడల్లా సగం మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మంత్రి పదవి పోయిన తర్వాత ఇప్పుడు రిటెయినింగ్ వాల్‌కు శంకుస్తాపన చేసి.. అది పూర్తి చేసి మాత్రమే ఓట్లు అడుగుతానని భీకరమైన సవాల్ చేసారు.
నెల్లూరు జిల్లాలో పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడల్లా నగరం పరిధిలోని భగత్ సింగ్ నగర్ నీట మునగాల్సిందే. ప్రతి ఏడాదీ ఇది జరిగే తంతే, కానీ ఇప్పటి వరకూ పరిష్కారం దొరకలేదు. గతేడాది వరదల సమయంలో సీఎం జగన్ ఇక్కడ పర్యటించారు. రిటైనింగ్ వాల్ కోసం ఆయన హామీ ఇచ్చారు. కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ ఏడాది మళ్లీ వరదలు వస్తండటంతో మంత్రి అంబటి రాంబాబుని పిలిపించి అనిల్ కుమార్ యాదవ్ ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఏడాదిలోగా గోడ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2024 ఎన్నికల్లో తాను ఈ పని పూర్తి చేస్తేనే ఓట్లు అడగడానికి వస్తానని చెప్పారు. నిజానికి ఆ వార్ నిర్మాణానికి టెండర్లు కూడా ఖరారవలేదు. మళ్లీ వరదలు వస్తే ప్రజలు తిరగబడతారన్న భయంతో శంకుస్థాపన చేశారు. దాన్ని పూర్తిచేసే ఓట్లు అడుగుతామని చెబుతున్నారు. చివరికి చేయలేక పోలవరం తరహాలో టీడీపీ అడ్డుకుందని కవర్ చేసుకునే చాన్సులే ఎక్కువ ఉన్నాయి.