దగ్గుబాటి కుటుంబం, రాఘవేంద్రరావు ప్రభుత్వ స్థలాన్ని అక్రమంగా కొన్నారంటూ తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. సింగిల్ బెంచ్‌లో వాళ్లకి అనుకూలమైన తీర్పు వచ్చినా ప్రభుత్వం తగ్గలేదు. హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో 26.16 ఎకరాల ప్రభుత్వ భూమిని సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుటుంబ సభ్యులు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి ప్రభుత్వానిదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకెళ్లింది. కానీ సింగిల్ బెంచ్‌లో దుగ్గబాటి, రాఘవేంద్రరావులకే అనుకూలమైన తీర్పు వచ్చింది
ఆ భూమిలో కొంత మేరకు మల్లయ్య అనే వ్యక్తికి అసైన్ చేస్తే తీసుకోలేదని, ఫలితంగా ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ప్రభుత్వ లాయర్లు హైకోర్టులో వాదించారు. మాజీ సైనికులకు 5 ఎకరాలు చొప్పున ఇవ్వడం 1963లో మొదలైతే అప్పటి తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి ఆ పథకం అమలులోకి రావడానికి 2 ఏండ్లు ముందే నరసింహలు నాయక్ అనే వ్యక్తికి ఇచ్చినట్లుగా బోగస్ డాక్యుమెంట్స్ సృష్టించారని వాదించారు. వాటిపై సంతకాలు, అప్పటి తహసీల్దార్ సంతకాలకు పోలిక లేదని, ఫోర్జరీ చేసినట్లుగా ఫోరెన్సిక్ శాఖ నివేదిక ఇచ్చిందన్నారు.
15 ఏండ్ల తర్వాత సేత్వారీని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఉదహరించిన సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసుకు వర్తించదని తెలంగాణ చెబుతోంది. భూమిపై హక్కులు లేని వాళ్ల నుంచి రామానాయుడు, రాఘవేంద్రరావు ఇతరులు కొనుగోలు చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ప్రభుత్వ వాదన దగ్గుబాటి, రాఘవేంద్రరావు ఫ్యామిలీలకు షాకిచ్చేదే.