ఓట్ల కోసం ప్రజలకు ఉచిత పథకాలు పంపిణీ చేయడం చాలా ప్రమాదకమని ప్రధానమంత్రి మోదీ సెలవిచ్చారు. యూపీలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్‌లో దాదాపుగా పదిహేను వేల కోట్లు వెచ్చించి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అత్యంత విశాలమన రహదారులని నిర్మించి ఢిల్లీకి అనుసంధానించారు. దీన్ని ప్రారంభించిన ప్రధాని .. ఉచిత పథకాల గురించి లెక్చరిచ్చారు. అలా చేయడం దేశానికి ప్రమాదకరమన్నారు. ప్రజా సంపదను ఇలా మౌలికసదుపాయాల కోసం ఖర్చు పెట్టాలని ఆయన ఉద్దేశం. ఇది వందశాతం నిజమే.
కానీ ఆయన ఆశీస్సులతో అప్పులు కుప్పలు కుప్పలుగా చేసి భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్న రాష్ట్రాలు కళ్లముందు కనిపిస్తున్నా.. అది దేశానికి ప్రమాదకరం కాదని ఎందుకునుకుంటున్నారోనన్న డౌట్ ప్రధాని మాటలు విన్న తర్వాత ఎవరికైనా వస్తుంది. రూ. లక్షల కోట్లు అడ్డగోలుగా అప్పులు చేస్తూ ఆ లెక్కలు చెప్పకపోయినా ఎందుకు అడగడంలేదన్న ప్రశ్న వస్తుంది. అడిగినంతనే అప్పులు ఇవ్వడానికి ఎందుకు ఉత్సాహపడుతున్నారన్నది కూడా తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. మౌలిక సదుపాయాల కోసం ప్రజాధనం ఒక్క రూపాయి వెచ్చించకుండా అప్పులు చేస్తూ ప్రజలకు పంచుతూ ఓటు బ్యాంక్ రాజకీయాలకుపాల్పడుతూంటే ఎందుకు సహకరిస్తున్నారని చాలా మందికి డౌౌట్ వస్తుంది.
నిజానికి మోదీ అవినీతిపైనా ఇలాంటి భీకరమైన స్పీచ్‌లు చాలా ఇచ్చారు. కానీ చేతల్లో మాత్రం ఆ ప్రయత్నాలు చేయడం చాలా తక్కువ. మోదీ మాటలు చెప్పడానికే కానీ.. చేయడానికి కాదని ఇలాంటి మాటల ద్వారా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఆయన చెప్పే మాటలు చాలా ఇన్స్పరియింగ్గా ఉంటాయి. అవి రాసేవారికి ఉన్నంత అవగాహన చదివే వారికి ఉండే బెటరని కొంత మంది విపక్ష నేతలు సెటైర్లు వేస్తూ ఉంటారు.